సాధారణంగా చాలా మంది సినిమా హీరోయిన్లు నాలుగు పదుల వయసులోనూ ఎంతో యవ్వనంగా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు.పెళ్లయి పిల్లలు పుట్టిన కూడా వారి గ్లామర్ మాత్రం చెక్కుచెదరదు.
ఈ క్రమంలోనే హీరోయిన్ల మాదిరి 40 లోనూ యంగ్ గా కనిపించాలని కొంత మంది తెగ ఆరాటపడుతూ ఉంటారు.అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే ఆయిల్ చాలా బాగా సహాయపడుతుంది.
నిత్యం ఈ ఆయిల్( Oil ) ను కనుక వాడితే ఏజ్ పెరిగినా మీ యవ్వనం మాత్రం తరగదు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక చిన్న క్యారెట్( Carrot ) ను తీసుకుని పీల్ తొలగించి సన్నగా తురుముకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో క్యారెట్ తురుము వేసుకోవాలి.
అలాగే ఒక కప్పు ఎండిన గులాబీ రేకులు, నాలుగు నుంచి ఐదు ఎండిన ఆరెంజ్ పండు తొక్కలు( Orange peels ), రెండు బిర్యానీ ఆకులు( Biryani leaves ) వేసుకోవాలి.అలాగే ఒక కప్పు ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ వేసుకొని బాగా కలపాలి.
ఇప్పుడు ఈ గిన్నెను మరుగుతున్న నీటిలో ఉంచి దాదాపు 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడికించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని గిన్నె ను పక్కకు తీసి స్ట్రైనర్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

పూర్తిగా చల్లారిన తర్వాత ఈ ఆయిల్ లో వన్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్( Almond oil ) మరియు నాలుగు చుక్కలు రోజ్ ఎసెన్షియల్ ఆయిల్( Rose essential oil ) వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ ఆయిల్ ను ఒక బాటిల్ లో నింపుకుని స్టోర్ చేసుకోవాలి.నిత్యం నైట్ నిద్రించే ముందు తయారు చేసుకున్న ఆయిల్ ను ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని సున్నితంగా ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.నిత్యం ఈ ఆయిల్ ను వాడటం వల్ల అదిరిపోయే స్కిన్ కేర్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.

ఈ ఆయిల్ లో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉంటాయి.అవి మన స్కిన్ ఏజింగ్ ప్రాసెస్ ను ఆలస్యం చేస్తాయి.ముడతలు, చారలు, చర్మం సాగటం వంటి వృద్ధాప్య లక్షణాలు త్వరగా దరిచేరకుండా అడ్డుకుంటాయి.చర్మాన్ని యవ్వనంగా మెరిపిస్తాయి.వయసు పెరుగుతున్న యవ్వనంగానే కనిపించాలని కోరుకుంటున్న వారికి ఈ ఆయిల్ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.నిత్యం ఈ ఆయిల్ ను వాడటం వల్ల స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది.
పొడి చర్మం సమస్య దూరం అవుతుంది.మరియు స్కిన్ షైనీగా సైతం మెరుస్తుంది.