ఈ ఆయిల్స్ రాస్తే మీ గోర్లు పొడ‌వుగా, దృఢంగా పెరుగుతాయ‌ట‌!

త‌మ గోర్లు పొడ‌వుగా, అందంగా ఉండాల‌నే కోరిక అంద‌రికీ ఉంటుంది.ముఖ్యంగా అమ్మాయిలు గోర్ల‌ను పొడ‌వుగా పెంచుకునేందుకు ప‌డే క‌ష్టాలు అన్నీ, ఇన్నీ కావు.

 These Oils Are Best To Get Strong Nails! Oils, Strong Nails, Beautiful Nails, Na-TeluguStop.com

కానీ, ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ప్ప‌టికీ.ఏదో ఒక స‌మ‌యంలో అల్లారు ముద్దుగా పెంచుకునే గోర్లు విరిగి పోతుంటారు.

అయితే గోర్లు విర‌గ‌కుండా ఉండాలీ అంటే అవి ఎంతో దృఢంగా ఉండాలి.అలా ఉండేందుకు కొన్ని కొన్ని ఆయిల్స్ అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

మ‌రి ఆ ఆయిల్స్ ఏంటీ.? వాటిని ఎలా వాడాలి.? అన్న‌ది లేట్ చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

గోర్లను బ‌లంగా మార్చ‌డంలో విట‌మిన్ ఇ ఆయిల్ సూప‌ర్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

రాత్రి నిద్రించే ముందు విటమిన్ ఇ క్యాప్సూల్ ఆయిల్‌ని తీసుకుని గోర్ల‌కు అప్లై చేసుకుని.అపై స్మూత్‌గా మ‌సాజ్ చేసుకోవాలి.

ఇలా ప్ర‌తి రోజు చేస్తే గోర్తు దృఢంగా మారి విర‌గ‌కుండా ఉంటాయి.మ‌రియు పొడ‌వుగా కూడా పెరుగుతాయి.

Telugu Beautiful Nails, Tips, Latest, Nails, Oils, Tea Tree Oil, Vegetable Oil,

అలాగే టీ ట్రీ ఆయిల్ సైతం గోర్ల‌ను దృఢంగా చేయ‌గ‌ల‌దు.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో పావు స్పూన్ టీ ట్రీ ఆయిల్‌, ఒక స్పూన్ తేనెను వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని గోర్ల‌కు అప్లై చేసి.కాస్త డ్రై అయిన త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా రోజుకు ఒక సారి చేస్తే త‌ర‌చూ గోర్లు విరిగిపోకుండా ఉంటుంది.మ‌రియు గోర్లు చిట్లడం, బ్రేక్ అవ్వడం వంటి స‌మ‌స్య‌లు కూడా ద‌రి చేర‌కుండా ఉంటాయి.

ఇక వెజిటేబుల్ ఆయిల్ కూడా గోర్ల‌ను బ‌లంగా మార్చ గ‌లదు.రాత్రి నిద్రించ‌డానికి ఒక పావు గంట ముందు వెజిటేబుల్ ఆయిల్‌ను డైరెక్ట్‌గా గోర్లుకు పూయాలి.అనంత‌రం కొన్ని నిమిషాల పాటు మ‌సాజ్ చేసుకుని.ఉద‌యాన్నే చ‌ల్ల‌టి నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఇలా ప్ర‌తి రోజూ చేసినా మంచి ఫ‌లితం ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube