గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్( BRS ) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) పైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన అనేక విమర్శలు చేస్తూనే వస్తున్నారు. కాంగ్రెస్ నేతలు కూడా దీనికి కౌంటర్లు ఇస్తున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక అవినీతి అక్రమాలకు పాల్పడిందని, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో భారీగా అవినీతి జరిగిందని , బీఆర్ఎస్ నేతలు బాగా లబ్ధి పొందారని కాంగ్రెస్ పదే పదే విమర్శలు చేస్తోంది.ముఖ్యంగా కాలేశ్వరం ప్రాజెక్టు( Kaleswaram Project ) విషయంలో బీఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అన్ని వ్యవహారాల పైన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విచారణలు చేయిస్తోంది.
ఈ వ్యవహారాలపైనే అటు కాంగ్రెస్ , ఇటు బీఆర్ఎస్ కీలక నేతల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి.ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో 2024 – 25 వార్షిక బడ్జెట్ పద్దు చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా కేసిఆర్ ,( KCR ) హరీష్ రావు( Harish Rao ) లను టార్గెట్ చేసుకొని సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో పంచ్ లు వేశారు.2017 జనవరి 4 నాటికి సీఎం కేసీఆర్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు పెడతామని ఒప్పందం చేసుకున్న మాట వాస్తవమా కాదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు సభలో అబద్ధాలు చెబుతున్న హరీష్ రావు
తన వద్ద ఉన్న సమాచారాన్ని పంపుతున్నామని సీఎం రేవంత్ తెలిపారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పినట్లు హరీష్ రావుకు హాఫ్ నాలెడ్జ్ అని, పెద్దాయనకు ఫుల్ నాలెడ్జ్ అంటూ చేతిలో ఫుల్ బాటిల్ ఉన్నట్టు చూపిస్తూ రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు.దీంతో సభలో ఒక్కసారిగా కాంగ్రెస్ సభ్యులు పెద్ద ఎత్తున నవ్వుకున్నారు. వాస్తవాలు మాట్లాడాలని హరీష్ రావు కు రేవంత్ రెడ్డి సూచించారు.రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చేందుకు టిఆర్ఎస్ నేతలు సిద్ధమవుతున్నారు.