ఇటీవల ఒక బ్రిటిష్ ( British )పర్యాటకుడు పెరూ దేశంలోని ఆండీస్ పర్వతాలను అన్వేషించడానికి వెళ్ళాడు.ఒక గ్రూప్ తో కలిసి అతను పర్వతాలను ఎక్స్‌ప్లోర్( Explore ) చేయడం ప్రారంభించాడు.
అయితే 15,000 అడుగుల ఎత్తులో తన గుంపు నుంచి వేరుపడి దిక్కుతోచని స్థితిలో ఒంటరిగా మిగిలిపోయాడు.అయితే అదృష్టవశాత్తు అతను ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడగలిగాడు.
అతని పేరు ఎల్ గురో ఇంగిల్స్.ఈ పర్యాటకుడు హువారాజ్ సమీపంలోని సాంటా క్రూజ్ మార్గంలో ప్రయాణిస్తుండగా, రెండవ రోజు తన గుంపు నుంచి వేరుపడ్డాడు.
పొగమంచు, భారీ మంచు కారణంగా పుంటా యూనియన్ పాస్ ను చేరుకోవడంలో ఆయన విఫలమయ్యాడు.ఒంటరిగా, మార్గం తెలియక, ఆయన ప్రాణాల కోసం పోరాడాల్సి వచ్చింది.
అప్పుడు, ఆయనకు ఒక వీధి కుక్క కనిపించింది.ఈ కుక్క తన తోకను ఆడించి, ఆయన్ని సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించింది.ఎల్ గురో ఆ సన్నివేశాన్ని వీడియోలో రికార్డ్ చేస్తూ, “నీవు ఇక్కడ ఎందుకు ఉన్నావు? ఇక్కడికి ఎలా వచ్చావు?” అని వీధి కుక్కను అడిగాడు.అతడు ఫన్నీగా “నీవే ఇప్పుడు నా గైడ్.
మనం దారి తప్పితే అది నీ తప్పే” అని అన్నాడు.
ఆ స్ట్రీట్ డాగ్ ఎల్ గురోను ( Street Dog El Gueronu )కష్టమైన మార్గంలో అత్యంత నైపుణ్యంతో నడిపించింది.ఆ పర్వతాలు ఎంతో బాగా తెలిసిన దానిలా వ్యవహరించింది.ఆ కుక్కపై పూర్తి నమ్మకం ఉంచిన ఎల్ గురో, దాని వెనుకే వెళ్లాడు.
చివరకు, సరైన మార్గం అని సూచించే ఒక బోర్డును వారు కలిశారు.ఆ వీడి కుక్క, పర్వత శిఖరాన్ని చేరే వరకు ఎల్ గురోతోనే ఉంది.
అక్కడ ఈ కుక్క, టూరిస్టు కలిసి మిగతా గ్రూప్ రాక కోసం ఎదురు చూశారు.
మిగతా గ్రూప్ వచ్చిన తర్వాత కూడా ఆ స్ట్రీట్ డాగ్ వారిని వెంబడించింది.వారి శిబిరానికి చేరుకున్నప్పుడు, మరొక కుక్క కూడా వారితో చేరింది.ఆ రెండు కుక్కలు మిగతా 13.5 మైళ్ల ప్రయాణం అంతా ఆ హైకర్లతోనే ఉన్నాయి.ఆ ప్రాంతంలోని స్థానికులు, అక్కడి కుక్కలు తరచుగా హైకర్లను వెంబడించి, గైడ్‌లుగా వ్యవహరిస్తాయని చెప్పారు.
ఎల్ గురో ఈ కథను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు, అది ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.చాలామంది ఆ కుక్క చాలా తెలివైనది, నమ్మకదగినది అని ప్రశంసించారు.