సెనేట్ ఆమోదం లేకుండానే కేబినెట్ నియామకాలు.. ట్రంప్ వ్యూహాత్మక ఎత్తుగడ

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ( Donald Trump )తన టీమ్‌ను రెడీ చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు.సమర్ధులైన వారిని తన యంత్రాంగంలోకి తీసుకుంటున్న ఆయన ఇప్పటికే చాలా వరకు నియామకాలు పూర్తి చేశారు.

 Donald Trump Could Bypass The Senate To Install His Cabinet Picks , Donald Trump-TeluguStop.com

అయితే అమెరికాలో అత్యున్నత పదవులను భర్తీ చేసేందుకు సెనేట్ ఆమోదం తప్పనిసరి.కానీ సెనేట్‌ ప్రమేయం లేకుండానే టాప్ అడ్మినిస్ట్రేషన్ పోస్టుల భర్తీని ట్రంప్ చేపట్టాలని చూస్తున్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Telugu Donald Trump, Donaldtrump, Joe Biden, Nership Public, Secretary, Secretar

అమెరికా రాజ్యాంగం ప్రకారం.సెనేట్, అధ్యక్షుడులు అత్యున్నత పరిపాలన అధికారులను నియమించే అధికారాన్ని పంచుకుంటారు.సాధారణంగా సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్( Secretary of Defence ), ఇతర ఉన్నత పదవులకు నామినేట్ అయిన వారిని సెనేటర్లు ప్రశ్నించి వారి సమర్ధతపై అంచనాకు వస్తారు.మొత్తం 1000 పోస్టులకు గాను దాదాపు 100 కీలకమైన పదవులకు సెనేట్ ఆమోదముద్ర తప్పనిసరి.

ట్రంప్ 2017 – 2021 లలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చాలా కేబినెట్ నియామకాలు సులభంగానే సెనేట్ ఆమోదాన్ని పొందాయి.కానీ కొందరి నామినేషన్స్‌ను సెనేట్ తిరస్కరించింది.

ఉదాహరణకు లేబర్ సెక్రటరీ నామినీ ఆండ్రూ పుజ్డెర్ ( Secretary of Labor nominee Andrew Puzder )నియామకానికి తగిన మద్ధతు లేకపోవడంతో ఆయన మధ్యలోనే తప్పుకోవాల్సి వచ్చింది.

Telugu Donald Trump, Donaldtrump, Joe Biden, Nership Public, Secretary, Secretar

ఇక ఈ నియామకాలకు ఆమోదం కూడా అధ్యక్షులందరి హయాంలో ఒకేలా లేదు.బుష్‌కు 85 రోజులు పడితే, జో బైడెన్‌కు ( Joe Biden )191 రోజులు పట్టినట్లు పార్ట్‌నర్‌షిప్ ఫర్ పబ్లిక్ సర్వీస్ పేర్కొంది.అయితే ఈ నియామకాలు వేగంగా జరిగేందుకు గాను ఛాంబర్‌ (సెనేట్ సెషన్)ను వాయిదా వేయాలని ట్రంప్ పావులు కదుపుతున్నారు.

సెనేట్ సెషన్‌లో లేనప్పుడు ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేయడానికి అధ్యక్షుడికి అమెరికా రాజ్యాంగం వెసులుబాటు కల్పిస్తోంది.అయితే ఈ విధానంలో నియమించబడిన అధికారులు గరిష్టంగా రెండేళ్లు మాత్రమే విధుల్లో ఉండగలరు.

కొందరు అమెరికా మాజీ అధ్యక్షులు ఈ నిబంధనను సద్వినియోగం చేసుకున్నట్లుగా కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ చెబుతోంది.ఈ పద్ధతి ద్వారా బరాక్ ఒబామా 32, బుష్ 171 నియామకాలు చేపట్టారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube