సరైన రీతిలో కష్టపడితే దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడం కష్టం కాదని ఇప్పటికే ఎంతోమంది సక్సెస్ స్టోరీలతో ప్రూవ్ అయింది.చూపు లేకపోయినా మానస అనే యువతి తన సక్సెస్ తో ప్రశంసలు అందుకుంటున్నారు.
కుటుంబ సభ్యులు సపోర్ట్ చేయడంతో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని ఎదుర్కొని మానస సక్సెస్ అయ్యారు.చీమలవారిగూడెంకు చెందిన మానస పుట్టుకతోనే అంధత్వంతో జన్మించారు.
ఐదో తరగతి వరకు మానస చీమలవారిగూడెంలోనే చదివింది.కారేపల్లి హైస్కూల్(Karepalli High School) లో 6 నుంచి పదో తరగతి వరకు చదివిన మానస కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో ఇంటర్ చదివారు.
తమ గ్రామం నుంచి కారేపల్లికి ఆటోలు సైతం సరిగ్గా నడిచేవి కాదు.అయినా చదువుపై ఉన్న మమకారంతో మానస ఫ్రెండ్స్ తో కలిసి నడుచుకుంటూ వెళ్లి చదివారు.
తర్వాత రోజుల్లో తారు రోడ్డు నిర్మాణం పూర్తి కాగా ఆటోలు పూర్తిస్థాయిలో నడవడంతో కారేపల్లి లోని వికాస్ డిగ్రీ కాలేజ్(Vikas Degree College) లో డిగ్రీ పూర్తి చేశారు.
తాజాగా గ్రూప్4(Group-4) ఫలితాలు రిలీజ్ కాగా ఈ ఫలితాలలో మానస జూనియర్ అకౌంటెంట్ జాబ్ (Manasa Junior Accountant Job)కు ఎంపిక కావడం గమనార్హం.
ఖమ్మంలో ఉన్న ఐడీసీఐ బ్యాంక్ లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జాబ్ చేస్తూనే మానస గ్రూప్స్ కు సిద్ధమై గ్రూప్4 పరీక్షలో తన ప్రతిభతో ఎంపికయ్యారు.మానస గ్రూప్4 ఉద్యోగం సాధించడంతో నెటిజన్లు అమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
మానస టాలెంట్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.మానస సక్సెస్ ఈ జనరేషన్ లో ఉన్న ఎంతోమంది యువతీ యువకులకు స్పూర్తి నింపుతుంది.మానస భవిష్యత్తులో మరిన్ని ఉన్నతమైన లక్ష్యాలను ఎంచుకుని ఆ లక్ష్యాలను సాధించాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.మానస సక్సెస్ వెనుక ఉన్న కుటుంబ సభ్యులను సైతం నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.