మన దేశ గర్భవతులు కెనడాకి ఎందుకు వెళ్తున్నారో తెలుసా.. ఈయన మాటలు వింటే..?

కెనడా దేశస్థులు గత కొంతకాలంగా భారతీయులను తీవ్రంగా ద్వేషిస్తూ వస్తున్నారు.వారు అలా ద్వేషించడానికి కారణాలు అనేకం అని విశ్లేషకులు చెబుతున్నారు.

 Canadian Man Explains Why Pregnant Indian Women Visit His Country Details, Chad-TeluguStop.com

ఈ క్రమంలో కెనడియన్ పౌరుడు చాడ్ ఎరోస్( Chad Eros ) తన సోషల్ మీడియా పోస్ట్‌తో ఓ పెద్ద వివాదాన్ని క్రియేట్ చేశాడు.భారతీయ మహిళల ప్రసవాలపై సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఎక్స్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు.

ఆ వీడియోలో, కెనడాలోని చిల్డ్రన్ కేర్ వార్డులు భారతీయ గర్భవతులతో( Pregnant Indian Women ) నిండిపోతున్నాయని ఆయన ఆరోపించారు.ఈ మహిళలు తమ పిల్లలు కెనడాలో( Canada ) జన్మించి ఆ దేశ పౌరత్వం పొందాలనే ఉద్దేశ్యంతో కెనడా వస్తున్నారని ఆయన వాదించారు.

ఈ వాదనకు ఆధారంగా ఎరోస్ తన అక్క కూతురు తాజాగా ఒక స్థానిక ఆసుపత్రిలో ప్రసవించిన సంఘటనను వివరించారు.ఆ సమయంలో అక్కడికి చాలా మంది భారతీయ మహిళలు కెనడాలో ప్రసవించేందుకే వచ్చారట.

కెనడా ఆసుపత్రులు అందరికీ చికిత్స చేయడంలో తప్పు లేదని, కానీ భారతీయ మహిళలు కెనడియన్ పౌరులకు ఉపయోగపడే స్థలాన్ని ఆక్రమిస్తున్నారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

చాడ్ ఎరోస్ అనే కెనడియన్ పౌరుడు తన వీడియోలో భారతీయ మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారాయి.ఆయన వాదన ప్రకారం, కెనడా ఆసుపత్రులు( Canada Hospitals ) భారతీయ మహిళలకు అందించే వైద్య సేవలకు బిల్లులు పంపినప్పటికీ, వారి నుంచి చెల్లింపులు వసూలు చేయడం కష్టమే.ఎందుకంటే వారికి కెనడియన్ హెల్త్ ఇన్సూరెన్స్ లేదు.

అంతేకాకుండా, ఈ మహిళలు ప్రసవించిన తర్వాత భారతదేశానికి తిరిగి వెళ్లిపోతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ పిల్లలు పెద్దయ్యాక కెనడా పౌరులుగా( Canada Citizenship ) మారి తమ కుటుంబాలను కెనడాకు తీసుకురావడానికి అవకాశం ఉంటుందని ఎరోస్ చెప్పారు.ఆయన పోస్ట్‌కు ఇప్పటికే 8,30,000కు పైగా వ్యూస్ వచ్చాయి.ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీసింది.

కొంతమంది కెనడియన్లు ఎరోస్ వాదనను సమర్థిస్తూ, ప్రభుత్వం ఈ విషయంలో కొత్త నిబంధనలు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.కెనడాలో జన్మించిన ప్రతి బిడ్డకు ఆటోమేటిక్‌గా పౌరసత్వం ఇచ్చే నిబంధనను రద్దు చేయాలని కొందరు సూచిస్తున్నారు.

అయితే, మరికొందరు ఈ సమస్యకు కారణం కెనడా నిబంధనలేనని, భారతీయ మహిళలను నిందించడం సరికాదని వాదిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube