తాజాగా యునైటెడ్ స్టేట్స్‌లోని మిల్వాకీ సిటీలో( Milwaukee City ) ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది.జేన్ వైట్ అనే 20 ఏళ్ల వ్యక్తి తన 8 నెలల కొడుకును చాలా హింసించాడు.
అది కూడా ఒక వీడియో గేమ్( Video Game ) ఓడిపోయిన కోపంతో, తన కొడుకును గోడకేసి గుద్దినట్లు తెలిసింది.ఆ సమయంలో బాలుడి తల్లి ఇంట్లో లేదు.
తర్వాత ఈ దిగ్భ్రాంతికర విషయం తెలిసింది.నవంబర్ 5న జరిగిన ఈ ఘటనను అధికారులకు తెలియజేసింది.
ఈ ఘటనలో బిడ్డ తీవ్ర గాయాలపాలైంది.ముఖ్యంగా, మెదడుకు పెద్ద గాయం అయింది.అంతేకాకుండా, బిడ్డకు పాత గాయాలు కూడా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.ఆ బిడ్డ చేతిలోని ఎముకలు విరిగిపోయాయి, చెవులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి.
ఈ గాయాలు వేర్వేరు దశల్లో ఉన్నందున, బిడ్డపై గతంలో కూడా దాడి జరిగిందని అనుమానిస్తున్నారు.
తండ్రి జేన్ వైట్ తన 8 నెలల కొడుకును హింసించినట్లు అంగీకరించాడు.అసిస్టెంట్ జిల్లా అటార్నీ మడెలిన్ విట్టే ఈ విషయాన్ని తెలిపారు.ఇంత చిన్న వయసున్న బిడ్డపై ( Baby ) ఇంత దారుణంగా ప్రవర్తించడం చాలా దారుణమని ప్రాసిక్యూటర్లు అన్నారు.
ఈ గాయాలను కలిగించగలిగినది జేన్ వైట్ ఒక్కడే అని వారు స్పష్టం చేశారు.జేన్ వైట్ ప్రముఖ బాస్కెట్‌బాల్ వీడియో గేమ్ NBA 2K ఆడుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
ఆటలో చివరి క్వార్టర్‌లో రెండు పాయింట్ల తేడాతో వెనుకబడిపోవడంతో కోపం తెచ్చుకున్నాడు దానిని కంట్రోల్ చేసుకోలేకపోయాడు.
జేన్ వైట్‌ను అరెస్టు చేసి, $100,000 నగదు బెయిల్‌పై ఉంచారు.ఆయన కొడుకు మరణిస్తే, ఆయనపై హత్య కేసు నమోదు చేయబడుతుంది.దీంతో ఆయనకు మరింత కఠిన శిక్ష పడే అవకాశం ఉంది.
ప్రస్తుతం, ఆయనకు గరిష్టంగా 62 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.బిడ్డ శరీరంలో పలు పాత గాయాలు కనిపించడంతో, గతంలో కూడా బాధించారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.