ప్రస్తుత రోజుల్లో నిద్రలేమి( Insomnia ) అనేది ఆడ మగ అనే తేడా లేకుండా కోట్లాది మందిని వేధిస్తోంది.నిద్రలేమి చిన్న సమస్యగా కనిపించిన శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.
కంటినిండా నిద్ర లేకపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు చుట్టూ ముడతాయి.అందుకే రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్రపోవడం చాలా అవసరం.
ఇకపోతే నిద్రలేమి తలెత్తడానికి అనేక కారణాలు ఉన్నాయి.అలాగే దాన్ని వదిలించుకోవడానికి కూడా ఎన్నో మార్గాలు ఉన్నాయి.
పాదాలకు మర్దన( Feet Massage ) చేయడం ద్వారా కూడా నిద్రలేమి నుంచి బయటపడవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.వారానికి రెండు సార్లు ఇప్పుడు చెప్పబోయే విధంగా పాదాలకు మర్దన చేసుకుంటే నిద్రలేమి పరార్ అవ్వాల్సిందే అంటున్నారు.
అందుకోసం ముందుగా ఒక బకెట్ తో సగానికి గోరువెచ్చని నీటిని తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు అల్లం తురుము( Ginger ) మరియు వన్ టేబుల్ స్పూన్ ఉప్పు( Salt ) వేసి కలపాలి.పాదాలను పావుగంట పాటు బకెట్ లో ఉంచి ఆపై పొడి వస్త్రంతో తుడుచుకోవాలి.

ఇప్పుడు పాదాలకు గోరువెచ్చని కొబ్బరి నూనె లేదా ఆవ నూనె లేదా నువ్వుల నూనె అప్లై చేసుకుని కనీస 10 నిమిషాల పాటు బాగా మసాజ్ చేసుకోవాలి.చివరిగా సాక్స్ ధరించి నిద్రించాలి.ఈ విధంగా మసాజ్ చేయడం వల్ల పాదాలలో రక్త ప్రసరణ గణనీయంగా మెరుగుపడుతుంది.మంచి రక్త ప్రసరణ( Blood Circulation ) మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది.

అలాగే రాత్రిపూట పాదాలకు మసాజ్ చేయడం వల్ల రిలాక్సేషన్ లభిస్తుంది.ఒత్తిడి, ఆందోళన వంటివి దూరం అవుతాయి.నిద్రలేమి సమస్య పరార్ అవుతుంది.పాదాలకు మర్దన చేయడం ద్వారా మీరు చాలా సులభంగా గాఢమైన నిద్రలోకి జారుకుంటారు.మసాజ్ వల్ల నిద్ర నాణ్యత కూడా పెరుగుతుంది.కాబట్టి నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా పైన చెప్పిన చిట్కా ను ఫాలో అవ్వండి.