ఏ ట్రెండ్ కూడా ఓ పట్టానా ఉండదు కదా.ఎప్పటికప్పుడు ఫ్యాషన్ లో మార్పులు జరుగుతూనే ఉన్నాయి.
ఒకప్పుడు గడ్డం పెంచడం అంటే కేవలం ఋషులు చేసే పని.ఆ తరువాత శాస్త్రవేత్తలు, రచయితలు పెంచడం మొదలుపెట్టారు.దాంతో గడ్డం అలాంటి వారికే తప్ప, రొమాంటిక్ ఫెలోస్ కి కాదు అనే భావాన ఉండేది.పైగా మీసాలు ఉన్న మగవారికి అంకుల్స్ లా చూడటం మొదలుపెట్టారు అమ్మాయిలు.
దాంతో సినిమా హీరోలు కూడా మీసం గడ్డం లేకుండా కనిపించారు.కాని ట్రెండ్ మారి గడ్డం పెంచడమే ట్రెండ్ అయ్యింది.
కేవలం సినిమా హీరోలే కాదు.క్రికెటర్స్ కూడా గడ్డాలు పెంచేశారు.
గడ్డలు పెంచిన మగవారు అమ్మాయిల కంటికి హాట్ గా కనిపించడం మొదలుపెట్టారు.కాని ఇప్పుడు మరో కొత్త ట్రెండ్ స్టార్ట్ అయ్యింది.
దాని పేరే “Break The Beard” .ఈ బ్రేక్ ది బియర్డ్ ట్రెండ్ మొదలుపెట్టి కోహ్లి మినహా భారత క్రికెటర్స్ అంతా ఇన్నాళ్ళు పెంచిన గడ్డం గీయడం మొదలుపెట్టారు.ఇంకేం .ఒక నేషనల్ లైఫ్ స్టయిల్ మ్యాగజీన్ కి ఓ కొత్త టాపిక్ దొరికింది.క్రికెటర్స్ బ్రేక్ ది బియర్డ్ అంటూ గడ్డాలు గీసేస్తున్నారు కదా .అది మీకు ఇష్టమేనా అంటూ కేవలం అమ్మాయిలనే అడిగింది ఆ మ్యాగజీన్.
గడ్డాలు తీయడంలో తప్పు లేదని, గడ్డం ఉంటే హాట్ గా, గడ్డం లేకపోతే క్యూట్ గా ఉంటారు అబ్బాయిలు అంటూ జవాబు వచ్చింది అమ్మాయిల దగ్గరినుంచి.గడ్డం పెంచిన మనిషి ఎంత హాట్ గా ఉన్నా, ముద్దు పెట్టె టైమ్ లో మాత్రం గడ్డం లేకపోతేనే బెట్టర్ అంతో 69% బ్రేక్ ది బియర్డ్ కి సపూర్ట్ గా ఓటు వేసారు.
“గడ్డం ఉంటే మగవారు హాట్ గా కనబడతారు.కోహ్లి ఈ ట్రెండ్ స్టార్ట్ చేసాడు.
కాని ఇప్పటివరకు తను గడ్డం తీయలేదు.మిగితా క్రికెటర్స్ తీస్తున్నారు.
బహుశా అనుష్కకి కోహ్లి గడ్డంతో ఉన్నా ముద్దుపెట్టుకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేదేమో.కాని నాకు మాత్రం పిచ్చి ఇబ్బందిగా ఉంటుంది.
అందుకే నా బాయ్ ఫ్రెండ్ ని క్లీన్ షేవ్ చేయించుకొమ్మని చెప్పాను.తను గడ్డం లేకపోయినా క్యూట్ గా ఉంటాడు.
సో, నాకు ఇబ్బంది లేదు.కిస్సింగ్ చేసేటప్పుడు గడ్డం లేకపోతే ఆ హాయి వేరు.
ఎంత హాట్ గా ఉన్నా సరే, గడ్డం పెంచిన మగవారిని ముద్దుపెట్టుకోవడం కష్టమే” అంటూ కామెంట్ చేసింది ఆర్తి అనే స్టూడెంట్.