పప్పు తిన్నాక గ్యాస్ సమస్య వస్తుందా..? అయితే ఇలా చేయండి..!

సాధారణంగా చాలామంది అధిక పరిమాణంలో పోషకాలు లభిస్తాయని బీన్స్( Beans ), కాయ ధాన్యాలను విచ్చలవిడిగా తినడానికి ఇష్టపడుతున్నారు.అయితే వీటిలో కూడా ఆమ్లత్వం లభిస్తుంది.

 Pulses Cooking Tips To Avoid Gastric Problems,gastric Problems,pulses,cooking Ti-TeluguStop.com

అందుకే వీటిని అతిగా తీసుకోవడం వలన గ్యాస్, జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.అందుకే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే తప్పకుండా పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది అని వైద్యనిపుణులు చెబుతున్నారు.

అయితే బీన్స్, కాయ ధాన్యాలు తిన్నప్పుడు పొట్టలో గ్యాస్ రాకుండా ఉండాలంటే వాటిని వండే క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

అయితే వీటిని వండే ఒక రోజు ముందు నీటిలో నానబెట్టి ఉదయాన్నే వండడం వలన పొట్టలో గ్యాస్ సమస్యలు( Gastric Problems ) రాకుండా ఉంటాయి.ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం చాలామంది పప్పుతో తయారుచేసిన కూరలను తీసుకోవడం వలన కూడా పొట్టలో గ్యాస్ సమస్యల బారిన పడుతున్నారు.దీని కారణంగానే చాలామందిలో కడుపుబ్బరం సమస్యలు కూడా రావడం మనం చూస్తూనే ఉన్నాం.

అందుకే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే తప్పకుండా వండుకునే క్రమంలో కూడా జాగ్రత్తలు పాటించాలి.ముఖ్యంగా ఒక రోజు ముందే పప్పును నీటిలో నానబెట్టి తీసుకోవాలి.

ఎప్పటినుంచో పొట్ట లో గ్యాస్ సమస్యలతో బాధపడేవారు మొలకెత్తిన గింజలు, బీన్స్ పచ్చిగా తినడం మానుకోవాలి.అలా తినాలనుకునేవారు వీటిని నీటిలో ఉడికించి తీసుకోవడం వలన పొట్టలో గ్యాస్ ఫామ్ కాకుండా ఉంటుంది.అంతేకాకుండా కాయ ధాన్యాలు, పప్పులను వండుకునే క్రమంలో తప్పకుండా నెయ్యి, వెల్లుల్లి, అల్లం, ఇంగువ లను కచ్చితంగా వినియోగించాలి.ఎందుకంటే వీటిని వినియోగించడం వలన పొట్టలో గ్యాస్ సమస్యలు రాకుండా ఉంటాయి అని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube