మహేష్ అలియాస్ శతమానంభవతి మహేష్జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటుడు.ఆ తర్వాత పలు సినిమాల్లో చేశాడు.
శతమానంభవతి సినిమా తనకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది.అందుకే తన పేరు ముందు ఆ సినిమా పేరును తగిలించుకున్నాడు.
అనంతరం ఆయనకు పలు సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. రంగస్థలం లాంటి సినిమాలోనూ మంచి క్యారెక్టర్ చేశాడు.
అయితే కొద్ది రోజుల క్రితం ఓ సినిమా వేడుకలో దర్శకుడు సుకుమార్.మహేష్ పై చెయ్యి చేసుకున్నాడనే వార్త ఒకటి హల్ చల్ చేసింది.
ఇందులో నిజా నిజాలు ఏంటో తాజాగా మహేష్ ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు.నిజాంగానే సుకుమార్ తనపై చెయ్యి చేసుకున్నాడా? లేదా? అనే వివరాలను తెలిపాడు.ఇంతకీ ఆయన ఏం చెప్పాడో ఓ సారి తెలుసుకుందాం.

ఓ సినిమా సక్సెస్ మీట్ జరగింది.ఈ వేడుకకు మహేష్ హాజరైనట్లు చెప్పాడు.స్టేజి మీదకు వెళ్లాక.
సుకుమార్ కాళ్లకు నమస్కరించినట్లు చెప్పాడు.ప్రతిగా తను కూడా నా కాళ్లకు నమస్కరించేందుకు ప్రయత్నించాడన్నాడు.
వెంటనే తను నన్ను లేపి భుజం మీద తట్టినట్లు చెప్పాడు.దాన్ని ఓ యూబ్యూబ్ చానెల్ వాళ్లు తప్పుడు తంబ్ నెయిల్ పెట్టి వీడియో పోస్ట్ చేసినట్లు చెప్పాడు.
తనకు ఆ సినిమాలో దర్శకుడు సుకుమార్ మంచి అవకాశం ఇచ్చినట్లు చెప్పాడు.అందుకు గౌరవంగా తాను ఆయన పాదాలకు నమస్కరించాను తప్ప.
అందులో ఏ దురుద్దేశం లేదన్నాడు.
అటు దర్శకుడు సుకుమార్ వ్యక్తిగతంగా చాలా మంచి వాడని చెప్పాడు మహేష్.
సినిమా షూటింగ్ సందర్భంగా సరిగా చేయకపోతే కోప్పడ్డా.ఆ తర్వాత వెంటనే సారీ చెప్తాడని వెల్లడించాడు.

మిగతా నటీనటులు అందరితోనూ తను చాలా చక్కగా కలిసి మెలిసి ఉంటాడని చెప్పాడు.తాను దర్శకుడిని అనే గర్వం ఆయనలో ఎక్కడా కనిపించదన్నాడు.అందుకే సినిమా జనాలు ఆయనను చాలా ఇష్టపడతారన్నాడు.యూట్యూబ్ వీడియో ద్వారా తనకు చెడు కంటే మంచే ఎక్కువ జరిగిందన్నాడు మహేష్.