వయసు పెరిగే కొద్ది ముఖంపై ముడతలు పడటం సర్వ సాధారణం.ఆహారపు అలవాట్లు, పోషకాల లోపం, వ్యాయామం చేయకపోవడం, సరైన స్కిన్ కేర్ లేకపోవడం, కెమికల్స్ ఎక్కువగా ఉండే క్రీములు వాడకం ఇలా రకరకాల కారణాల వల్ల ముడతలు ఏర్పడతాయి.
దాంతో ఏం చేయాలో తెలియక తెగ సతమతమైపోతుంటారు.అయితే అలాంటి సమయంలో ఇప్పుడు చెప్పబోయే కొన్ని సింపుల్ హోమ్ రెమెడీస్ పాటిస్తే సులువుగా ముడతల సమస్యకు చెక్ పెట్టవచ్చు.
మరి ఆ హోమ్ రెమిడీస్ ఏంటో లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరి పాలు వయసు పెరిగే కొద్ది వచ్చే ముడతలను నివారించడంలో అద్భుతంగా సహాయపడతాయి.
ముందుగా ఒక బౌల్ లో కొబ్బరి పాలు మరియు కొద్దిగా తేనె తీసుకుని మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖంపై, మెడపై పూసుకుని ఇరవై నిమిషాల అనంతరం చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి.
ఇలా రెగ్యులర్‌గా చేస్తే ముడతలు, సన్నని చారలు తగ్గు ముఖం పట్టి చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.

ముడతలకు చెక్ పెట్టడంలో అరటి పండు కూడా ఎఫెక్టివ్‌గా పని చేస్తుంది.బాగా పండిన అరటి పండు గుజ్జులో ఎర్ర గులాబీల పేస్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమానికి ముఖానికి పట్టించి పావు గంట పాడు డ్రై అవ్వనివ్వాలి.
ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా ప్రతి రోజు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
ఇక ఈ ఇంటి చిట్కాలతో పాటు వాటర్ ఎక్కువగా తీసుకోవాలి.ప్రతి రోజు కనీసం ఇరవై నిమిషాలు అయినా వర్కవుట్స్ చేయాలి.తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలి.నట్స్, గుడ్లు, పాలు డైలీ డైట్‌లో ఉండేలా చూసుకోవాలి.
రోజుకు ఖచ్చితంగా ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రించాలి.అప్పుడు చర్మంపై ముడతలు మాయమై.
అందంగా, కాంతివంతంగా మరియు యవ్వనంగా కనిపిస్తారు.