మన శరీరానికి అవసరమయ్యే అత్యంత ముఖ్యమైన పోషకాల్లో ప్రోటీన్( Protein ) ఒకటి.అయితే ఒంటికే కాదు ఆరోగ్యమైన జుట్టును నిర్వహించడానికి కూడా ప్రోటీన్ చాలా అవసరం.
అందుకే అప్పుడప్పుడు జుట్టుకు( Hair ) ప్రోటీన్ మాస్కులు వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే జుట్టు ఆరోగ్యానికి మద్దతు ఇచ్చే ఒక బెస్ట్ ప్రోటీన్ మాస్క్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు కొబ్బరి ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో కొబ్బరి పాలు( Coconut Milk ) సపరేట్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు మెంతి పిండి మరియు అరకప్పు కొబ్బరి పాలు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.చివరిగా రెండు ఎగ్స్ ను( Two Eggs ) బ్రేక్ చేసి వేసి మరోసారి కలుపుకోవాలి.
దాంతో మన ప్రోటీన్ మాస్క్ అనేది రెడీ అవుతుంది.

ఇప్పుడు తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూతో శుభ్రంగా తల స్నానం చేయాలి.గుడ్డు, కొబ్బరిపాలు, మెంతి పిండిలో ప్రోటీన్ తో సహా మన జుట్టు ఆరోగ్యానికి అవసరమయ్యే అనేక పోషకాలు నిండి ఉంటాయి.
ఈ ప్రోటీన్ హెయిర్ మాస్క్ ను( Protein Hair Mask ) వారానికి ఒకసారి వేసుకోవడం వల్ల చాలా అంటే చాలా ప్రయోజనాలు పొందుతారు.

ప్రధానంగా ఈ మాస్క్ జుట్టును బలంగా మారుస్తుంది.జుట్టుకు అవసరమయ్యే పోషణ అందిస్తుంది.జుట్టు రాలడాన్ని నిరోధిస్తుంది.
అలాగే ఈ ప్రోటీన్ మాస్క్ జుట్టు ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది.చుండ్రు సమస్యను నివారిస్తుంది.
కురులను మూలాల నుంచి స్ట్రాంగ్ గా మారుస్తుంది.హెయిర్ డ్యామేజ్ కు చెక్ పెడుతుంది.
పొడి జుట్టు తో బాధపడుతున్న వారికి కూడా ఈ ప్రోటీన్ మాస్క్ చాలా బాగా సహాయపడుతుంది.ఈ మాస్క్ డ్రై హెయిర్ ను రిపేర్ చేస్తుంది.
జుట్టులో తేమను లాక్ చేస్తుంది.శిరోజాలు మృదువుగా మెరిసేందుకు మద్దతు ఇస్తుంది.
కాబట్టి ఆరోగ్యమైన దృఢమైన ఒత్తైన జుట్టును కోరుకునే వారు ఈ ప్రోటీన్ హెయిర్ మాస్క్ ను వేసుకోవడం అస్సలు మిస్ అవ్వకండి.