సమ్మర్ అంటేనే మామిడి పండ్ల సీజన్. సమ్మర్ స్టార్ట్ అవ్వడంతో మామిడి పండ్ల హడావుడి కూడా స్టార్ట్ అయింది.
పండ్లలోనే రారాజు అయిన మామిడి పండ్లను( Mangoes ) పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటుంటారు.అయితే తెలిసో తెలియకో మామిడిపండ్లు తిన్న వెంటనే కొందరు నీరు( Water ) తాగేస్తుంటారు.
కానీ అలా చేయకూడదు.అసలు మామిడిపండ్లు తిన్న వెంటనే నీరు ఎందుకు తాగకూడదు? అన్న విషయం ఇప్పుడు తెలుసుకుందాం.
మామిడిపండ్లు సహజంగానే ఆమ్లత్వం కలిగి ఉంటాయి.అందువల్ల వాటిని తిన్న వెంటనే వాటర్ తాగితే జీర్ణ ప్రక్రియకు( Digestion ) అంతరాయం కలిగి, కడుపు ఉబ్బరం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు తలెత్తవచ్చు.
అలాగే మామిడి పండ్లు శరీరానికి హీట్ ను ప్రొడ్యూస్ చేస్తాయి.వాటిని తిన్న వెంటనే చల్లని నీరు తాగితే.శరీరంలో హీట్, కోల్డ్ బ్యాలెన్స్ ప్రభావితమై గొంతు నొప్పి లేదా జీర్ణ సంబంధిత ఇబ్బందులు కలుగవచ్చు.

అలాగే మామిడి పండ్లలో పలు ఎంజైమ్‌లు ఉంటాయి.ఇవి జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి సహాయపడతాయి.ఒకవేళ మామిడి పండ్లు తిన్న వెంటనే నీరు తాగితే, ఆ ఎంజైమ్‌ల ప్రభావం తగ్గిపోవచ్చు.
కాబట్టి వీలైనంత వరకు మ్యాంగోస్ తిన్న వెంటనే నీరు తాగడం మానుకోవడం.ఒకవేళ నీరు తాగాల్సిన అవసరం ఉంటే, గోరువెచ్చని నీరు తాగండి.లేదా 30-45 నిమిషాల తర్వాత నీరు తాగొచ్చు.ఈ వ్యవధిలో మామిడిపండు పూర్తిగా జీర్ణమై, శరీరం దాన్ని శోషించుకోగలుగుతుంది.

ఇక ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే.మామిడి పండ్లలో ఉండే విటమిన్ ఎ, విటమిస్ సి శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది.మామిడిలో ఉన్న పొటాషియం మరియు మెగ్నీషియం రక్తపోటును నియంత్రిస్తాయి.విటమిన్ బి6 మెదడు పనితీరును మెరుగుపరిచి, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.అలాగే మామిడి పండ్లలోని యాంటీ ఆక్సిడెంట్లు, పొలీఫెనాల్స్ శరీరాన్ని టాక్సిన్ల నుంచి కాపాడుతాయి.కంటి చూపును పెంచే బీటా కెరోటిన్, హృదయానికి మేలు చేసే ప్రొబయాటిక్ గుణాలను కూడా మామిడి పండ్లు కలిగి ఉంటాయి.
కాబట్టి ఈ సీజనల్ ఫ్రూట్ ను అస్సలు వదలకండి.