కొరటాల శివ.తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు.
సినిమా రచయితగా కెరీర్ మొదలు పెట్టిన ఆయన పలు సినిమాలకు చక్కటి కథలు అందించాడు.మరికొన్ని సినిమాలకు అద్భుతమైన డైలాగులు అందించాడు.
ఆ తర్వాత దర్శకుడిగా మారాడు.తన తొలి సినిమా మిర్చితో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు.
ప్రభాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ సినిమా.ఫ్యాక్షన్ బ్యాగ్రాఫ్ లో తెరకెక్కిన ఈ సినిమా.
మనుషుల మధ్య శత్రుత్వాలను ప్రేమతో జయించాలి అనే కాన్సెప్ట్ తో మిర్చి సినిమాను తెరకెక్కించారు.ఈ సినిమా బాక్సీఫీ దగ్గర సంచలన విజయం సాధించడంతో శివ.వెనక్కి తిరిగి చూసుకోలేదు.ఆ తర్వాత వచ్చిన మరో మూడు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ సాధించాయి.
శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలు ఓ రేంజిలో విజయం సాధించాయి.ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఆచార్య మూవీ చేస్తున్నాడు.
నిజానికి తన తల్లి శివను దర్శకుడిగా చూడాలి అనుకుంది.కానీ ఆమె కోరిక తీరకుండానే తన తల్లి చనిపోయింది.
శివకు 10 ఏండ్ల వయసు ఉన్నప్పుడే తన తండ్రి చనిపోయాడు.అప్పటి నుంచి తన ఆలనా పాలనా తన తల్లే చూసుకుంది.
సినిమా రైటర్ గా శివ సక్సెస్ ను చూసింది.కానీ దర్శకుడిగా తన విజయాలను చూడకుండానే కన్నుమూసింది.
తను దర్శకత్వం వహించిన మిర్చి సినిమా షూటింగ్ కొనసాగుతున్నది.సరిగ్గా సినిమా సగం షూటింగ్ జరగ్గానే తను అకస్మాత్తుగా చనిపోయింది.ఈ విషయాన్ని ఓ సారి గుర్తు చేసుకుని తను చాలా బాధ పడ్డాడు.తన తల్లి తన తొలి సినిమా విజయాన్ని చూడకుండానే చనిపోయింది.అది తన జీవితంలో మర్చిపోలేని లోటు అంటాడు ఆయన.తన జీవితం ఇవ్వాల ఈ స్థాయిలో ఉందంటే అందుకు కారణం తన తల్లి అని చెప్పాడు.తన విజయాలను తన కంటే తన తల్లే ఎక్కువ ఎంజాయ్ చేసినట్లు వెల్లడించాడు కొరటాల శివ.