వింటర్ సీజన్ వచ్చిందంటే చాలు రకరకాల చర్మ సంబంధిత సమస్యలు తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి.చర్మం పొడి బారి పోవడం, ముడతలు, దురదలు, చర్మం అంద విహీనంగా మారడం.
ఇలా ఎన్నో సమస్యలు వేధిస్తాయి.వీటిని నివారించుకునేందుకు రకరకాల లోషన్లు, మాయిశ్చరైజర్లు, క్రీములు యూజ్ చేసి నానా పాట్లు పడుతుంటాయి.
అయితే ఈ వింటర్ సీజన్‌లో ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లో ఒక న్యాచురల్ అండ్ సూపర్ ఫేస్ ప్యాక్‌ను యూజ్ చేస్తే గనుక.చాలా అంటే చాలా సులభంగా ముఖ చర్మానికి యవ్వనంగా, కాంతి వంతంగా మెరిపించుకోవచ్చు.
మరి ఆ ఫేస్ ప్యాక్ ఏంటీ ఏంటీ.? ఎలా తయారు చేసుకోవాలి.? ఎలా వాడాలి.? వంటి విషయాలను ఏ మాత్రం లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల యాపిల్ పేస్ట్, రెండు స్పూన్ల ద్రాక్ష పండ్ల జ్యూస్, ఒక స్పూన్ అరటి పండు గుజ్జు, ఒక ఎగ్ వైట్, ఒక స్పూన్ స్వచ్ఛమైన తేనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు గోరు వెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకుని.
ఆపై తయారు చేసుకున్న మిశ్రమానికి ముఖానికి మరియు మెడకు ప్యాక్‌లా అప్లై చేసుకోవాలి.

పది హేను లేదా ఇరవై నిమిషాల పాటు డ్రై అయిన తర్వాత కూల్ వాటర్‌తో ముఖాన్ని, మెడను శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.అనంతరం మంచి మాయిశ్చరైజర్‌ను పూసుకోవాలి.వారంలో రెండంటే రెండు సార్లు ఇలా చేస్తే గనుక మొటిమలు, మచ్చలు, ముడతలు పోయి చర్మం యవ్వనంగా మెరిసి పోతుంది.
స్కిన్ టోన్ మెరుగు పడుతుంది.డ్రై స్కిన్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
మరియు స్కిన్ హైడ్రేటెడ్‌గా, కాంతి వంతంగా మారుతుంది.