టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న కొరియోగ్రాఫర్లలో శేఖర్ మాస్టర్( Sekhar Master ) ఒకరు.దాదాపుగా 13 సంవత్సరాల నుంచి శేఖర్ మాస్టర్ సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే కెరీర్ తొలినాళ్లలో తన స్టెప్స్ తో ప్రశంసలు అందుకున్న శేఖర్ మాస్టర్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా విమర్శల పాలు అవుతున్నారు.రాబిన్ హుడ్ అదిదా సర్ప్రైజ్ సాంగ్( Adhi Dha Surprisu Song ) విషయంలో శేఖర్ మాస్టర్ పై వచ్చిన నెగిటివ్ కామెంట్లు అన్నీఇన్నీ కావు.
శేఖర్ మాస్టర్ కావాలని ఇలాంటి స్టెప్స్ కంపోజ్ చేస్తున్నారో లేక యాదృచ్ఛికంగా జరుగుతోందో అయితే అర్థం కావడం లేదని చెప్పవచ్చు.అయితే ఈ స్టెప్ కొత్త స్టెప్ కాదని వీరసింహారెడ్డి సినిమాలోని సుగుణ సుందరి సాంగ్( Suguna Sundari Song ) లో కూడా ఇలాంటి స్టెప్ ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
విచిత్రం ఏంటంటే రెండు సాంగ్స్ కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ కాగా ఈ రెండు సినిమాలు మైత్రీ బ్యానర్ సినిమాలే కావడం గమనార్హం.

అయితే శేఖర్ మాస్టర్ ఢీ షోలో కంటెస్టెంట్స్ వేసిన స్టెప్స్ కాపీ చేస్తారని కొంతమంది కామెంట్లు చేసినా ఆ కామెంట్లలో వాస్తవం లేదు.అయితే తనపై వస్తున్న విమర్శల విషయంలో శేఖర్ మాస్టర్ కొంతమేర జాగ్రత్త వహిస్తే బాగుంటుందని కచ్చితంగా చెప్పవచ్చు.శేఖర్ మాస్టర్ భవిష్యత్తులో ఈ విమర్శల గురించి స్పందించే ఛాన్స్ అయితే ఉంది.

శేఖర్ మాస్టర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండగా ఈయన స్థాయిలో గుర్తింపును సంపాదించుకున్న కొరియోగ్రాఫర్లు సైతం తక్కువమంది ఉన్నారు.కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తే శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా మరిన్ని సంచలనాలను సృష్టించే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.శేఖర్ మాస్టర్ కొత్త ప్రాజెక్ట్స్ గురించి క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది.