ఇండియన్ బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలా(Gutta Jwala) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.స్టార్ బాడ్మింటన్ ప్లేయర్ గా సక్సెస్ అందుకున్న ఈమె సినిమాలలో కూడా నటించిన సంగతి తెలిసిందే.
ముఖ్యంగా నితిన్(Nithin) నిత్యామీనన్ (Nithya Menon)హీరో హీరోయిన్లుగా నటించిన గుండెజారి గల్లంతయ్యింది(Gundejari Gallanthyinde).సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేసిన విషయం మనకు తెలిసిందే ఈ సాంగ్ ద్వారా ఈమె ఫేమస్ అవ్వడమే కాకుండా ఈ సినిమాకు నేషనల్ వైడ్ మంచి ప్రమోషన్ కూడా లభించింది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న గుత్తా జ్వాలా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని విషయాలను తెలియచేశారు.తాను బ్యాట్మిటన్ ప్లేయర్ గా పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే సినిమా అవకాశాలు వచ్చాయి.నాకు సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు నా భర్త కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అని తెలిపారు.ఇలా సినిమా అవకాశాలు వచ్చిన తాను రిజెక్ట్ చేస్తూ వచ్చారని సినిమాలలో నటించాలంటే సిగ్గుగా ఉంటుందని తెలిపారు.

సినిమాలలో నటించేవారు రోజుకి 24 గంటలు కష్టపడుతూనే ఉండాలి.సినిమాలో ఉండాలి అంటే మనం ఎంతో మారాల్సి ఉంటుంది సిగ్గుపడకుండా ఉండాలి.ప్రతీ విషయంలో అడ్జస్ట్ అవుతూ ఉండాలని తెలిపారు.కానీ స్పోర్ట్స్ విషయంలో అలా కాదు రోజుకు 10 గంటలు ప్రాక్టీస్ చేస్తే చాలు తర్వాత విశ్రాంతి తీసుకోవచ్చు.
ఇక గుండెజారి గల్లంతయ్యింది సినిమాలో స్పెషల్ సాంగ్ కేవలం నితిన్ కోసమే చేశానని తెలిపారు.నితిన్ తనకు చాలా బెస్ట్ ఫ్రెండ్ ఒకరోజు పార్టీలో మాట్లాడుకుంటూ ఇలా స్పెషల్ సాంగ్ చేయాలి అంటే సరే అన్నాను తర్వాత మూడు సంవత్సరాలకు వచ్చి ఒక సాంగ్ ప్లాన్ చేశాను నీకోసమే చేశాను అని చెప్పడంతో నటించాల్సి వచ్చింది అంటూ ఈ సందర్భంగా గుత్తా జ్వాల అప్పటి విషయాలను అభిమానులతో పంచుకున్నారు.