ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు ఎవరు అంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది రాంగోపాల్ వర్మ.ఒకప్పుడు తన సినిమాలతో సెన్సేషన్ సృష్టించిన రాంగోపాల్ వర్మ ఇప్పుడు తన సినిమాలతో సెన్సేషన్ గా మారిపోయారు.
కాగా నేడు రాంగోపాల్ వర్మ పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవితం గురించి తీసిన సినిమాల గురించి ఒక సారి తెలుసుకుందాం 1962 ఏప్రిల్ 7వ తేదీన విజయవాడలో కృష్ణంరాజు సూరమ్మ దంపతులకు పుట్టాడు రాంగోపాల్ వర్మ. ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు విడుదలైన ప్రతి సినిమాను చూస్తూ సినిమాల్లోకి రావాలని ఆశ పెంచుకున్నాడు.
బ్రతుకుతెరువు కోసం కొన్నాళ్లపాటు ఒక వీడియో పార్లర్ నడిపాడు రాంగోపాల్ వర్మ.ఇక తెలుగు చిత్ర పరిశ్రమలోకి వచ్చి తన మొదటి సినిమా సినిమాతోనే సెన్సేషన్ సృష్టించాడు అన్న విషయం తెలిసిందే.
ఒక్కసారిగా తెలుగు సినిమా ఫార్మాట్ను శివ సినిమాతో మార్చేశాడు.అయితే కేవలం కాలేజీ నేపథ్యంలో కాకుండా మాఫియా హర్రర్ చిత్రాలతో కూడా ప్రేక్షకులను పలకరించాడు రాంగోపాల్ వర్మ.
అప్పట్లో వర్మ అంటే ఒక పేరు కాదు బ్రాండ్ అన్నట్లుగా హవా కొనసాగించాడు.స్టార్ లకి కాదు కొత్త నటీనటులకు ఎక్కువగా అవకాశాలు ఇస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందాడు.
అక్కినేని నాగేశ్వరరావు హీరోగా హీరోగా తెరకెక్కిన రావు గారి ఇల్లు అనే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు రాంగోపాల్ వర్మ.
బి.
గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన స్టేట్ రౌడీ సినిమా కూడా అసిస్టెంట్గా పనిచేశాడు.ఆ తర్వాత వర్మ కథ చెప్పిన విధానం నచ్చి నాగార్జున శివ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు.ఇక ఆ తర్వాత తన డ్రీమ్ హీరోయిన్ శ్రీదేవి వెంకటేష్ జంటగా క్షణక్షణం చేసి కూడా మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.1993 లో వర్మ మణిరత్నం తో కలిసి గాయం సినిమా తీశారు.ఇక జగపతి బాబు ఈ సినిమాలో హీరోగా నటించారు.ఇక ఈ సినిమా అతని కెరీర్ ను మలుపు తిప్పింది.జగపతి బాబు కి ఉత్తమ నటుడిగా తొలి నంది అవార్డు కూడా దక్కింది.ఇక శివ సినిమా సమయంలో ఉత్తమ దర్శకుడిగా ఏకంగా ఎన్టీఆర్ చేతుల మీదుగా నంది అవార్డు అందుకున్నారు రాంగోపాల్ వర్మ.
ఆ తర్వాత వర్మ తీసిన గోవింద గోవింద సినిమా పెద్ద కాంట్రవర్శి అయ్యింది.దీంతో అసలు తెలుగు సినిమాలు తీయాలని ఒట్టు వేసుకున్నాడు.
కానీ ఆ తర్వాత ఒట్టు తీసి గట్టున పెట్టేసాడు.

ఇక బాలీవుడ్ లో కూడా వర్మ ఒక రేంజ్ లోనే హవా నడిపించాడు.అమీర్ ఖాన్ జాకీష్రాప్ హీరో హీరోయిన్ గా తీసిన రంగీలా బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసింది.ఇక రంగీలా సక్సెస్తో బాలీవుడ్లో కొన్నాళ్ళపాటు సెటిలయ్యాడు.
సత్య సినిమా వర్మ దర్శకత్వం ప్రతిభ కు బాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది.ఇక అజయ్ దేవగన్ తో మాఫియా నేపథ్యంలో తీసిన కంపెనీ సినిమా వర్మ గట్స్ బాలీవుడ్ కి తెలిసేలా చేసింది.
ఇక అమితాబ్ బచ్చన్ తో తీసిన సర్కార్ సినిమా ఒక మంచి సినిమాగా నిలిచిపోయింది.ఇప్పుడు వరకు వర్మ దగ్గర అసిస్టెంట్ గా చేసి స్టార్ డైరెక్టర్లుగా కొనసాగుతున్న వారు చాలా మంది ఉన్నారు.
వారిలో అనురాగ్ కశ్యప్, మధుర్ బండార్కర్, శివ నాగేశ్వర రావు, తేజ, నివాస్, కృష్ణవంశీ, పూరి జగన్నాథ్ లాంటి దర్శకులు రాము దర్శకత్వం స్కూల్ నుంచి బయటకు వచ్చిన వారే కావడం గమనార్హం.ఇటీవల కాలంలో అయితే ఆయన కాంట్రవర్సీ సినిమాలను తెరకెక్కిస్తున్నారా.
లేకపోతే ఆయన తీసిన సినిమాలు కాంట్రవర్సి అవుతున్నాయా అన్నది అర్థం కాని విధంగా మారిపోయింది.