మోకాళ్ళ నొప్పులకు ఈ ఆయిల్ ఒక ఔషధం.‌. ఇంట్లోనే తయారు చేసుకోండిలా!

మోకాళ్ళ నొప్పులు.( Knee Pains ) వయసు పైబడిన వారే కాదు ఇటీవల కాలంలో 30 ఏళ్ల వారు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారు.

 This Magical Oil Helps To Get Rid Of Knee Pain Details, Knee Pain, Knee Pain Re-TeluguStop.com

కారణం ఏదైనా సరే మోకాళ్ళ నొప్పుల కారణంగా తీవ్రమైన బాధకు గురవుతుంటారు.ఎక్కువసేపు ఏ పని చేయలేకపోతుంటారు.

నడవడానికి, నిలబడడానికి, మెట్లు ఎక్కడానికి కూడా ఎంతో కష్టతరంగా ఉంటుంది.మీరు కూడా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే ఆయిల్ మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

మోకాళ్ళ నొప్పులకు ఈ ఆయిల్ ఒక ఔషధంలా పనిచేస్తుంది.

ఆయిల్ తయారీ కోసం.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక కప్పు నువ్వుల నూనెను( Sesame Oil ) పోసుకోవాలి.

అలాగే 10 నుంచి 15 శుభ్రంగా పొట్టు తొలగించి కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి( Garlic ) రెబ్బలు వేసుకుని ఐదు నిమిషాల పాటు ఉడికించాలి.ఆ తర్వాత అందులోనే హాఫ్ టీ స్పూన్ ఆర్గానిక్ పసుపు( Turmeric ) వేసి మరొక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

Telugu Garlic, Tips, Knee Pain, Knee Pain Oil, Knee Pain Tips, Knee Oil, Latest,

ఇప్పుడు ఆయిల్ ను స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి.ఆపై ఒక బాటిల్ లో స్టోర్ చేసుకోవాలి.ఇక ఈ ఆయిల్ ను మోకాళ్ళకు అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.నైట్ నిద్రించేముందు లేదా స్నానం చేయడానికి రెండు గంటలు ముందు నిత్యం ఈ ఆయిల్ ను మోకాళ్ళకు అప్లై చేసుకుంటే కొద్ది రోజుల్లోనే మీరు మంచి రిజల్ట్ ను గమనిస్తారు.

Telugu Garlic, Tips, Knee Pain, Knee Pain Oil, Knee Pain Tips, Knee Oil, Latest,

ఈ ఆయిల్ న్యాచురల్ పెయిన్ కిల్లర్ మాదిరిగా పనిచేస్తుంది.నిత్యం ఈ ఆయిల్ ను వాడటం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది.వాపు తగ్గుతుంది.మోకాళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.అలాగే ఈ ఆయిల్ శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి, ఇవి ఆర్థరైటిస్ వల్ల కలిగే మోకాలి నొప్పిని నివారించడంలో ఉత్తమంగా హెల్ప్ చేస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube