వేస‌విలో దొరికే ఈ పండు ర‌క్త‌హీనత ఉన్న‌వారికి ఒక వ‌రం.. తెలుసా?

వేసవి కాలంలో విరివిగా లభ్యమయ్యే పండ్ల‌లో పనస( Jackfruit ) ఒకటి.మార్చి, జూన్ మధ్య పనస పండు ఎక్కువగా లభిస్తుంది.

 Here The Health Benefits Of Summer Superfood Jackfruit Detais, Jackfruit, Summer-TeluguStop.com

పనస పండు చాలా రుచికరంగా ఉంటుంది.అందుకే పెద్దలతో పాటు పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా ప‌న‌స పండును తింటుంటారు.

అలాగే పనస పండులో అనేక రకాల విట‌మిన్లు, మిన‌ర‌ల్స్‌, ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.అందువల్ల ఆరోగ్యపరంగా పనస అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది.

ముఖ్యంగా రక్తహీనతతో( Anemia ) బాధపడుతున్న వారికి పనస పండు ఒక వరమ‌నే చెప్పుకోవచ్చు.

పనస పండులో ఐరన్ మంచి మోతాదులో ఉంటుంది, ఇది హీమోగ్లోబిన్ స్థాయిని పెంచి, శరీరంలో తగినంత రక్త ప్రసరణకు సహాయపడుతుంది.

రక్తహీనత సమస్యను స‌మ‌ర్థ‌వంతంగా త‌రిమికొడుతుంది.అలాగే ఎముక‌ల దృఢ‌త్వానికి ప‌న‌స‌ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.

ప‌న‌స పండులో మెండుగా ఉండే కాల్షియం, మెగ్నీషియం బోన్స్ కు బ‌లాన్ని ఇస్తాయి.ఎముక సంబంధిత జ‌బ్బుల నుంచి ర‌క్ష‌ణ కల్పిస్తాయి.

Telugu Anemia, Sugar Levels, Tips, Iron, Jackfruit, Latest, Seasonal Fruit, Supe

ఫ్లేవనాయిడ్లు, ఫైటోన్యూట్రియెంట్లు ఉండటం వల్ల ట్యూమర్ వృద్ధిని నియంత్రించడంలో ప‌న‌స పండు ఉత్త‌మంగా సహాయపడుతుంది.ప‌న‌స‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో హాని కలిగించే ఫ్రీ రాడికల్స్‌ను త‌గ్గిస్తుంది.ప‌న‌స పండులో విట‌మిన్ సి కూడా పుష్క‌లంగా ఉంటుంది.ఇది రోగ నిరోధ‌క శ‌క్తిని( Immunity Power ) పెంపొందిస్తుంది.వైరస్‌లు, బాక్టీరియాల బారిన ప‌డ‌కుండా కాపాడుతుంది.

Telugu Anemia, Sugar Levels, Tips, Iron, Jackfruit, Latest, Seasonal Fruit, Supe

పనస పండులో కార్బోహైడ్రేట్లు మరియు సహజమైన చక్కెరలు అధికంగా ఉంటాయి.అందువ‌ల్ల ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.అయితే పనస పండు వేడిని ఉత్పత్తి చేసే స్వభావం క‌లిగి ఉంటుంది.

అందువ‌ల్ల పనస పండును మితంగా తినాలి.ఎక్కువగా తింటే అజీర్ణం, వాయువుల సమస్యలు, డయేరియా వంటివి తలెత్తవచ్చు.

అలాగే ప‌నస పండు సహజంగానే తీపిగా ఉండటంతో రక్తంలో చక్కెర స్థాయిని పెంచవచ్చు.కాబ‌ట్టి డ‌యాబెటిస్ ఉన్న‌వారు ప‌న‌స పండును ఎవైడ్ చేయ‌డ‌మే ఉత్త‌మం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube