1.జగన్ భావోద్వేగం

ఏపీ బడ్జెట్ రెండో రోజు సమావేశంలో సందర్భంగా ఏపీ సీఎం జగన్ ఇటీవల మరణించిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతికి సంతాపం తెలిపారు ఈ సందర్భంగా జగన్ భావోద్వేగానికి గురయ్యారు.
2.శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్
ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను ప్రారంభించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది.
3.అమరావతి రైతులకు ప్లాట్ల రిజిస్ట్రేషన్

ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు అమరావతి నిర్మాణానికి పొలాలు ఇచ్చిన రైతులకు ఫ్లాట్లను రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
4.కెసిఆర్ పై బండి సంజయ్ కామెంట్స్
తెలంగాణ సీఎం కేసీఆర్ కు మహిళలంటే గౌరవం లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు.
5.తెలంగాణ లో ముందస్తు ఎన్నికలు : రేవంత్

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని, పార్టీ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి అన్నారు
6.సస్పెన్షన్ పై హైకోర్టు కు బీజేపీ ఎమ్మెల్యే లు
అసెంబ్లీలో బిజెపి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన వ్యవహారంపై బిజెపి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
7.షర్మిల ఆకాంక్ష

ఆడబిడ్డలు అందరూ ఆర్థికాభివృద్ధి సాధించాలన్నది దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశయమని, వారి అభివృద్ధి చెందాలని అది తన ఆకాంక్ష అని షర్మిల పేర్కొన్నారు.
8.మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యాయత్నం కేసు
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై హత్య ప్రయత్నం జరిగిన సంగతి తెలిసిందే .ఈ కేసులో నిందితులకు నాలుగు రోజుల కస్టడీని కోర్టు విధించింది.
9.గవాస్కర్ క్షమాపణలు

షేన్ వార్న్ ను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు , దీనిపై క్షమాపణలు తెలుపతున్నట్లు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ వెల్లడించారు.
10.సింగరేణి బొగ్గు గనిలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ సింగరేణి బొగ్గు గనులు పైకప్పు కూలిన ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.ఈ ఘటనలో ఏడుగురు చిక్కుకుపోగా ఒకరు సురక్షితంగా బయటపడ్డారు మిగిలిన వారి కోసం గాలింపు చేపట్టారు.
11.అమరావతి పై బొత్స కామెంట్స్

టీడీపీ అధినేత చంద్రబాబు స్వలాభం కోసమే అమరావతి ని రాజధాని చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు.
12.సంగం బ్యారేజీ కి మేకపాటి పేరు : జగన్
ఏపీ అసెంబ్లీలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం పై సీఎం జగన్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా సంగం బ్యారేజీ కి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు పెడుతున్నట్లు జగన్ ప్రకటించారు.
13.పోలీసుల పై లోకేష్ విమర్శలు

ఏపీ పోలీసుల పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు చేశారు.ఏపీ లో ఉన్నది పోలీసులా ? లేదా వైసిపి రౌడీషీటర్లకు అనుచరులు అంటూ కామెంట్ చేశారు.
14.వైసీపీ ఎమ్మెల్యే కు మావోయిస్టుల నుంచి బెదిరింపులు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పాడేరు నియోజకవర్గ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మీ హెచ్చరిస్తూ మావోయిస్టుల పేరుతో లేఖ విడుదలైంది.
15.వనపర్తి జిల్లాలో కేసీఆర్ పర్యటన

తెలంగాణ సీఎం కెసిఆర్ వనపర్తి జిల్లాలో పర్యటిస్తున్నారు.
16.వచ్చే ఏడాది నుంచి ఇంగ్లీష్ మీడియంలో బోధన
మన ఊరు మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్, ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు .వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం లో బోధన ఉంటుంది అని కేసీఆర్ వెల్లడించారు.
17.అచ్చెన్న నాయుడు కామెంట్స్

టిడిపి నేత కోన వెంకట్ రావు వైసిపి గుండాలే పొట్టన పెట్టుకున్నారని తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్న నాయుడు విమర్శించారు.
18.గవర్నర్ వ్యవస్థపై నారాయణ విమర్శలు

గవర్నర్ వ్యవస్థపై సిపిఐ నేత నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ముఖ్యమంత్రి కి హెడ్ క్లర్క్ గా మారారని నారాయణ విమర్శించారు.
19.మున్సిపల్ మహిళా కార్మికులు రిలే నిరాహార దీక్ష
తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఏపీలో మున్సిపల్ మహిళా కార్మికులు రిలే నిరాహార దీక్షకు దిగారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 49,400
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 53,890