ఉదయాన్నే ఖాళీ కడుపుతో నడవడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా..?

ముఖ్యంగా చెప్పాలంటే ఉదయం సమయంలో ఖాళీ కడుపుతో నడవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు( Health benefits ) ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.దీన్ని వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

 Are There So Many Health Benefits Of Walking On An Empty Stomach Early In The Mo-TeluguStop.com

అలాగే కీళ్ల నొప్పులు రాకుండా ఉంటాయి.గుండె ఆరోగ్యంగా ఉండడంలో నడక ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

ఉదయం పూట నడిచే 30 నిమిషాల నడక అనేక వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది.ఇది గుండె సమస్యల ప్రమాదాన్ని కూడా దూరం చేస్తుంది.

అయితే ఉదయాన్నే ఎందుకు నడవాలి? సాయంత్రం నడక ఎంత వరకు మంచిది అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Pressure, Diabetes, Gas Problem, Benefits, Tips-Telugu Health

ముఖ్యంగా చెప్పాలంటే ఉదయం నడక( walking ) అనేది మెరుగైన జీర్ణ క్రియ కు ఉపయోగపడుతుంది.రోజంతా చురుకుగా ఉండేలా చేస్తుంది.ఇంకా చెప్పాలంటే గ్యాస్ సమస్యను( Gas problem ) తగ్గించడంలో, కడుపును ఆరోగ్యంగా ఉంచడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

ముఖ్యంగా చెప్పాలంటే ఉదయాన్నే ఖాళీ కడుపుతో నడవడం గుండెకు మంచిది.ఇది రక్తపోటును( Blood pressure ) నియంత్రిస్తుంది.గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.కడుపు ఖాళీ కడుపుతో నడవడం వల్ల మన శరీరంలో కొవ్వును కరిగించి ఆ శక్తిని ఇంధనంగా నిల్వ చేస్తుంది.

అలాగే ఉదయాన్నే నడవడం అనేది షుగర్ వ్యాధి ఉన్నవారిలో అయితే రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది.

Telugu Pressure, Diabetes, Gas Problem, Benefits, Tips-Telugu Health

ఇంకా చెప్పాలంటే మధుమేహం( Diabetes ), ఫ్రీ డయాబెటిస్ ఉన్న వారు ప్రతిరోజు ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం ఎంతో మంచిది.అలాగే ఉదయాన్నే 30 నిమిషాల పాటు నడవడం అనేది రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది.ఆరు బయట నడవడం అనేది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.

నడకతో కాస్త నెమ్మదిగా అయినా బరువు తగ్గవచ్చు.ఇది జీవక్రియను పెంచడమే కాకుండా కేలరీల లోటును కూడా భర్తీ చేసి బరువును తగ్గేలా చేస్తుంది.

ఇంకా చెప్పాలంటే పగటి పుట వ్యాయామం చేయడం కన్నా, ఉదయం పూట నడక చాలా వరకు ఒత్తిడిని తగ్గిస్తుంది.మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.

రోజంతా హుషారుగా ఉండేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube