ఏపీ టీడీపీ కార్యదర్శి అచ్చెన్నాయుడు వైసీపీ ఎమ్మెల్యే రోజా కి చాలెంజ్ విసిరారు.విషయంలోకి వెళితే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి అతిథిగా హాజరైన సమయంలో సభలో మహిళలంతా జగన్ కి జై కొడితే… ఆ సౌండ్ నారావారి గుండెల్లో వారి కర్ణభేరి లో రీ సౌండ్ రావాలని ఎమ్మెల్యే రోజా డైలాగులు వేయడం జరిగింది.
అంతేకాకుండా చంద్రబాబు హయాంలో మహిళలపై అనేక దాడులు జరిగాయని.నారావారి నరకాసుర పాలన గురించి రాష్ట్రంలో ప్రతి మహిళకు బాగా తెలుసు అని రోజా వ్యాఖ్యానించడం జరిగింది.
ఇదే సమయంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నుద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.మహిళలను బూటు కాలితో తన్నిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అని విమర్శల వర్షం కురిపించింది.
పార్టీ లేదు బొక్క లేదు అన్న వ్యక్తి ఇప్పుడు.రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా 160 సీట్లు తగ్గకుండా… తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని జోక్ చేస్తున్నారని… గట్టి చెట్ని వేసుకుని తింటే 160 కిలోల పెరుగుతారు ఏమో కానీ 160 సీట్లు… రావటం ఏమో కానీ ఇప్పుడున్న 23 సీట్లు కూడా రాకపోవచ్చని రోజా తనదైన శైలిలో విమర్శల వర్షం కురిపించారు.

దీంతో రోజా చేసిన వ్యాఖ్యలపై అచ్చెన్నాయుడు రియాక్ట్ అయ్యారు.దమ్ముంటే రోజా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని ఛాలెంజ్ విసిరారు.నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతే మహిళలకు ఆస్తిలో హక్కు లభించింది అని గుర్తుచేశారు.గత సార్వత్రిక ఎన్నికలలో ప్రజలు మోసపోయి జగన్ కి అధికారం కట్టబెట్టారని.
తనదైన శైలిలో అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు.