నిర్మాత నాగ వంశీ( Produced Naga Vamsi ).ప్రస్తుతం సోషల్ మీడియాలో అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు.
ఇకపోతే నిర్మాత నాగ వంశీ తాజాగా నిర్మించిన చిత్రం మ్యాడ్ స్క్వేర్( Mad Square ).ఈ సినిమా మార్చి 29న విడుదల కానుంది.ఈ సందర్భంగా తాజాగా మూవీ నిర్వహించారు.ఈ సందర్భంగా నాగవంశం మాట్లాడుతూ అనేక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు చాలా మూవీల విషయాల గురించి కూడా స్పందించారు.హరిహర వీరమల్లు సినిమా గురించి అల్లు అర్జున్, త్రివిక్రమ్ ( Allu Arjun, Trivikram )కాంబో గురించి డాకు మహారాజ్ గురించి ఇలా చాలా విషయాల గురించి స్పందించారు.

మార్చి 28వ తేదీన హరిహర వీరమల్లు సినిమా( Harihara Veeramallu movie ) విడుదల కాబోతుందా అని ప్రశ్నించగా.ఆ విషయం గురించి పవన్ కళ్యాణ్ లేదా మూవీ మేకర్స్ ను అడగండి.ఒకవేళ ఆ సినిమా మార్చి 28న విడుదల అయితే మా సినిమా పోస్ట్ పోన్ అవుతుంది అని తెలిపారు.అనంతరం అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో గురించి వస్తున్న వార్తలపై స్పందిస్తూ.
ఆ సినిమా ఇప్పుడే స్టార్ట్ కాదు.ఈ ఏడాది ద్వితీయార్థంలో మొదలవుతుంది అని చెప్పుకొచ్చారు నాగ వంశీ.
అనంతరం బాలయ్య బాబు హీరోగా నటించిన డాకు మహారాజ్ సినిమా గురించి స్పందిస్తూ.

డాకు మహారాజ్ ( Daku Maharaj )చిత్రం కలెక్షన్లు తగ్గడానికి కారణం చెబుతూ.ఆ సినిమాకు సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎఫెక్ట్ పడింది.అయితే బాలకృష్ణ గారి వల్ల కొన్ని ఏరియాల్లో భారీ వసూళ్లు వచ్చాయి.
రెండు సినిమాలకు ఆశించినంత వసూళ్లు రాలేదు.ఓటీటీలో మాత్రం ఆదరణ రెండు చిత్రాలకు బావుంది.
సోలోగా సినిమాలు రావడం కష్టం అని ఆయన అన్నారు.ఈ సందర్భంగా నిర్మాత నాగ వంశీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ సందర్భంగా ఇంకా చాలా రకాల అంశాల గురించి మాట్లాడారు నిర్మాత నాగ వంశీ.







