టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా 8 విజయాలను సొంతం చేసుకున్న అతికొద్ది మంది దర్శకులలో అనిల్ రావిపూడి(anil ravipudi) ఒకరు.అనిల్ రావిపూడి పారితోషికం సైతం ఒకింత భారీ స్థాయిలో ఉంది.
బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న అనిల్ రావిపూడి తాను మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తినని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 20 సంవత్సరాలు అవుతోందని చెప్పుకొచ్చారు.డైరెక్షన్ లోకి వచ్చిన తర్వాత మూడేళ్లు ఇబ్బందులు పడ్డానని అనిల్ రావిపూడి కామెంట్లు చేశారు.
హీరో కళ్యాణ్ రామ్ (Hero Kalyan Ram,)నాపై నమ్మకంతో పటాస్ (Pataas)సినిమాకు ఛాన్స్ ఇచ్చారని డైరెక్టర్ గా నా ప్రయాణం మొదలై 10 సంవత్సరాలు అవుతోందని పేర్కొన్నారు.ప్రేక్షకులు నాపై చూపించే ప్రేమాభిమానాలు నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చాయని అనిల్ అన్నారు.
ఏజ్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ నా సినిమాల గురించి గొప్పగా చెబుతుంటే సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

యూట్యూబ్ లో తన గురించి వస్తున్న వీడియోల గురించి సైతం అనిల్ రావిపూడి స్పందించారు.నా గురించి ఇష్టం వచ్చినట్టు కథలు రాస్తున్నారని అందమైన వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియోలు క్రియేట్ చేస్తున్నారని ఆయన వెల్లడించారు.యూట్యూబ్ లో ఆ వీడియోలను చూసిన మా బంధువులు, ఆత్మీయులు ఆ వీడియోలను నా భార్యకు పంపి నా భార్యను ప్రశ్నిస్తున్నారని అనిల్ పేర్కొన్నారు.

ఈ విషయంపై ఇప్పటికే సైబర్ క్రైమ్ (Cyber Crime)అధికారులకు ఫిర్యాదు చేశానని అనిల్ వెల్లడించారు.కాబట్టి మర్యాదగా వీడియోలు తీసేయండని ఆయన పేర్కొన్నారు.నా గురించి మాత్రమే కాదు చాలామంది గురించి ఇలాంటి వీడియోలు చేస్తున్నారని అనిల్ రావిపూడి వెల్లడించారు.ఇలాంటి వీడియోల వల్ల ఎంతోమంది వ్యక్తిగతంగా ఇబ్బంది పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.
చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.







