తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - సెప్టెంబర్ 7, బుధ వారం, 2022

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.06

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

26

రాహుకాలం:మ.12.00 మ1.30 వరకు

అమృత ఘడియలు: ఉ.ద్వాదశి మ.2.00 సా4.00 వరకుు

Advertisement

దుర్ముహూర్తం: ఉ.11:.57 మ12.48 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.మీరు చేపట్టిన పనుల్లో తోటి వారి సహాయం మీకు అందుతుంది.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.చాలా సంతోషంగా ఉంటారు.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

వృషభం:

Advertisement

ఈరోజు మీరు విందు వినోదల కార్యక్రమాల్లో పాల్గొంటారు.అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

మిథునం:

ఈరోజు మీరు కొన్ని విలువైన వస్తువులు కొలుగోలు చేస్తారు.ఈరోజు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.కొన్ని దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం:

ఈరోజు మీరు చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే అంతా మంచే జరుగుతుంది.స్నేహితులతో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా గడుపుతారు.మీ తండ్రి యొక్క ఆరోగ్యం ఈరోజు కుదుట పడుతుంది.

సింహం:

ఈరోజు మీ కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.మీరు చేసే ఉద్యోగంలో మార్పుల వలనకొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.

పై అధికారుల నుండి ప్రశంసలకు పొందుతారు.

కన్య:

ఈరోజు మీరు అప్పు తీర్చాలనే ఆలోచనలో ఉంటారు.ఇతర విషయాలపై కాకుండా మీ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి.వ్యాపారస్తులు ఈరోజు మంచి లాభాలను పొందుతారు.

మీ చిన్ననాటి స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.

తులా:

ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.ఇతరుల సహాయం మీకు ఎప్పుడూ ఉంటుంది.పిల్లల పట్ల ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.శత్రువులకు దూరంగా ఉండటమే మంచిది.

వృశ్చికం:

ఈరోజు మీరు అనారోగ్య సమస్యతో సతమతమవుతారు.అనవసరమైన ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.ఇరుగు పొరుగు వారితో వాదాలకు దిగే అవకాశం ఉంది.

ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.అనవసరంగా ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.

ధనస్సు:

ఈరోజు రాజకీయ నాయకులు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీపై ఉన్న బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు.ఇంటి నిర్మూలన గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.

ఈరోజు మీకు తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.

మకరం:

ఈరోజు మీరు భవిష్యత్తుకు సంబంధించిన మంచి నిర్ణయాలు తీసుకుంటారు.విద్యార్థులు విదేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.కొన్ని చెడు సవాసాలకు దూరంగా ఉండటమే మంచిది.

ఈరోజు మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.

కుంభం:

ఈరోజు మీరు ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.మీరంటే గిట్టని వారు మీపై నిందలు మోపుతారు.స్థలం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.

సమయానికి బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.

మీనం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల పట్ల మీ సమయాన్ని వృధా చేయకండి.ఎప్పటి నుండో ఉన్న కోర్ట్ సమస్యల నుండి ఈరోజు మీరు బయట పడతారు.తరచూ మారేమి నిర్ణయాల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురై అవకాశం ఉంది.

తాజా వార్తలు