లక్ష్మీదేవి విష్ణుమూర్తి పాదాల దగ్గరే ఎందుకు ఉంటుందో తెలుసా..?

ముక్కోటి దేవుళ్లలో లక్ష్మీదేవి విష్ణుమూర్తికి ఒక ప్రత్యేక స్థానం ఉంది అని కచ్చితంగా చెప్పవచ్చు.అలాగే భగవంతుని దశావతారాలలో విష్ణుమూర్తి అవతారం మొదటిది అని దాదాపు చాలా మందికి తెలుసు.

 Why Lakshmi Devi Is Near The Feet Of Maha Vishnu Details, Lakshmi Devi, Vishnu M-TeluguStop.com

ఈ అవతారంలో వైకుంఠంలోని పాల సముద్రంలో ఆదిశేషుని పైన విష్ణుమూర్తి( Vishnumurthy ) సేదతీరుతూ ఉంటే లక్ష్మీదేవి( Lakshmi Devi ) శ్రీహరి పాదాల వైపు కూర్చొని పాదాలను నోక్కుతూ ఉంటుంది.ఇంకా చెప్పాలంటే విష్ణుమూర్తి అంటే విశ్వాసానికి రక్షకుడు అనీ భక్తులు నమ్ముతారు.

ముఖ్యంగా చెప్పాలంటే లక్ష్మీదేవి సంపదలు కురిపించిన ఎప్పుడు శ్రీహరి పాదాలను నోక్కుతూ ఉంటుంది.

Telugu Bhakti, Devotional, Lakshmi Devi, Maha Vishnu, Muneendra, Shukra Charyudu

అలాగే సంపదలు కురిపించినా లక్ష్మీదేవి ఎందుకు శ్రీహరి పాదాల చెంత కూర్చుంటుంది.ఈ విషయాల గురించి చాలా మందికి తెలిసి ఉండదు.మరి ఈ విషయాల పై పురాణాలు, ఉపనిషత్తులు ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే లక్ష్మీదేవి విష్ణుమూర్తి గురించి ఎక్కువగా ప్రచారంలో ఉన్న పురాణాలను( Puranas ) చూసుకుంటే ఒక రోజు నారదమునీంద్రుడు లక్ష్మీదేవి దగ్గరకు వచ్చి ఇలా అడిగాడు.అమ్మ లక్ష్మీదేవి ఎందుకు నీవు నిరంతరం విష్ణువు పాదాల చెంత కూర్చుని పాదాలు నొక్కుతూ ఉంటావు.

Telugu Bhakti, Devotional, Lakshmi Devi, Maha Vishnu, Muneendra, Shukra Charyudu

అప్పుడు లక్ష్మీదేవి ఏమని సెలవిచ్చింది అంటే గ్రహా ప్రభావం మానవ మాత్రుల పైనే కాదు దేవతల మీద కూడా ఉంటుంది.ఎంతటి మహాదేవుడైన గ్రహప్రభావం నుంచి తప్పించుకోలేరు.రాక్షస గురూ శుక్రాచార్యుడు ( Shukracharyudu ) పురుషుల పదాలలో ఉంటాడు.అలాగే దేవగురువు స్త్రీల చేతులలో నివసిస్తాడు.మహిళలు పురుషుని పాదాలను తాకడం వల్ల దేవుడికి రాక్షసుడికీ మధ్య కలయిక ఉంటుంది.దీనివల్ల ఐశ్వర్యం కలుగుతుంది.

దీనితో పాటు శుభం జరుగుతుందని లక్ష్మీదేవి నారదమునీంద్రుడు సెలవిచ్చింది.ఈ విషయాన్ని పలు పురాణాలలో తెలిపినట్లు పండితులు చెబుతున్నారు.

అందుకే మహిళలు తమ భర్తల పాదాలు తాకితే శుభం జరుగుతుందని పండితులు చెబుతూ ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube