ఈ మధ్యకాలంలో సిటీల్లో పట్టించుకోవడం లేదు కాని, ఇంటి గడపకు పసుపు ముగ్గు లేకపోతే ఊళ్లల్లో కోప్పడతారు.ప్రతిరోజూ వాకిలి, ఇళ్లు ఊడ్చిన వెంటనే గడపను కడిగి.
చక్కగా పసుపు రాసి ముగ్గు వేస్తారు.అలాగే కుంకుమ కూడా పెడ్తారు.
ఈ జెనరేషన్ వాళ్లు ఈ పద్ధతిని అస్సలు పట్టించుకోరు.దాన్ని ఓ మూఢనమ్మకంలా చూస్తారు.
మన శాస్త్రాలు చెప్పిన ఆచారాలకి, మనుషులు సృష్టించుకున్న మూఢనమ్మకాలకి చాలా తేడా ఉంటుంది.మన శాస్త్రాల్లో సైన్స్ ఉంది.
ఆ శాస్త్రాలు చెప్పిన కొన్ని పద్ధతులు లేదా ఆచారాలు ఏదో ఊరికే చెప్పినవి కాదు, వాటి వెనుక శాస్త్రీయమైన కారణాలు కూడా ఉంటాయి.మామిడి తోరణాలు ఎందుకు కడతారు అంటే అలకరణం కోసమే కాదు, మంచి గాలి కోసం.
అరటి ఆకుల్లో ఎందుకు భోజనం చేయాలి అంటే శుభ్రత కోసం, పర్యావరణాన్ని రక్షించుకోవడం కోసం.ఇలా మన ఆచారాల వెనుక సైన్స్ ఉంటుంది.
గడపలకి పసుపు రాయడం వెనుక కూడా సైన్స్ ఉంది.
మామూలుగానైతే గడపకి పసుపెందుకు అంటే లక్ష్మీదేవి ఆశీస్సుల కోసం అని చెబుతారు లేదా పసుపు పవిత్రతకి చిహ్నం, ఇల్లు పవిత్రంగా ప్రశాంతంగా ఉండాలంటే గడపకి పసుపు రాయాలని అంటారు.
మరికొందరు ఏం చెబుతారు అంటే గడప పవిత్రంగా ఉండాలి, పసుపు రాస్తే గడప తొక్కకుండా ఉంటారు అని.ఆడపిల్లలు గడపకి పసుపు రాస్తే మంచి భర్త వస్తాడని కూడా అంటారు.ఇలాంటి కారణాలు ఈ సైన్స్ యుగంలో చెబితే ఎవరు నమ్ముతారు.అందుకే సైన్స్ పద్ధతిలోనే ఈ ఆచారాన్ని వివరించాలి.
పసుపులో యాంటి బ్యాక్టీరియల్, యాంటి ఫంగల్, యాంటి ఇన్ఫెక్షన్ గుణాలు ఉంటాయని మనం పుస్తకాల్లో చదువుకున్నాం కదా.గడపకి పసుపు రాయడం వలన ఎన్నో క్రీములు కీటకాలు మన గడప దాటడానికి సాహసించవు.మనం సాధారణంగా చెప్పులని గడపకి దగ్గరలోనే విడుస్తాం.ఆ చెప్పులతో పాటు బ్యాక్టీరియా ఇంటిదాకా వస్తుంది.కాని ఇంటి లోపలకి రాకుండా అడ్డుకోవాలంటే పసుపు గడపకి రాయాలి.దాంతో మనం చాలారకాల ఇన్ఫెక్షన్స్ నుంచి ఇంట్లోవాళ్ళని కాపాడుకోవచ్చు.
ఇదండీ .సైన్స్ ప్రకారం గడపకి పసుపు రాయడం వెనుక ఉన్న లాజిక్.