ఒక్కో దర్శకుడికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది.కొంత మంది యాక్టర్లను రిపీటెడ్ గా తమ సినిమాలలో కనిపించేలా చూస్తారు.
అలా త్రివిక్రమ్ సినిమాల్లో అలీ ఎక్కువగా కనిపించినట్లే.రాజమౌళి సినిమాల్లోనూ శేఖర్ కనిపిస్తాడు.
రాజమౌళి దర్శకత్వం వహించిన ఒకటి అర మూవీ మినహా ప్రతి సినిమాలోనూ శేఖర్ ఉంటాడు.చిన్నదో.
పెద్దతో.ఏదో ఒక క్యారెక్టర్ మాత్రం తనకోటి ఉంటుంది.
అయితే రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా నటించే ఈ యాక్టర్ ఎంత సంపాదించి ఉంటాడు అనేది చాలా మందికి ఓ ప్రశ్నగా మిగిలిపోయింది.అయితే ఈ విషయానికి సంబంధించి ఆయన తాజాగా పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
అవేంటో ఇప్పుడు చూద్దాం.
అందరూ తను ఎంతో వెనుకేసుకున్నట్లు భావిస్తారు కానీ.
అంత లేదని చెప్పాడు శేఖర్.కొన్నిసార్లు ఏ అవకాశాలు లేక ఇబ్బందులు కూడా పడ్డట్లు చెప్పాడు.
ఒకసారి తన సినిమాలో నటించాక.ఆ తర్వాత నెమ్మదిగా తనతో మంచి బాండింగ్ ఏర్పడినట్లు చెప్పాడు.
ఆ పరిచయం తోనే ఏమాత్రం అవకాశం ఉన్నా తనకు ఓ క్యారెక్టర్ ఇస్తాడని చెప్పాడు.అయితే తాను బాహుబలి సినిమాలో లేకపోవడంపై పలు రూమర్లు వచ్చినట్లు చెప్పాడు.
రాజమౌళితో గొడవల మూలంగానే తనకు ఇందులో అవకాశం రాలేదని పలువురు కామెంట్ చేశారని చెప్పాడు.అయితే వాటిలో ఏమాత్రం వాస్తవం లేదని వెల్లడించాడు.
గొప్ప దర్శకుడితో తనకు ఎందుకు గొడవలు ఉంటాయని ప్రశ్నించాడు.అసలు తను సెట్ లో మాట్లాడేదే చాలా తక్కువ అన్నాడు.
జస్ట్ రెండు మూడు విషయాలు మాత్రమే మాట్లాడి పనిలోకి వెళ్లిపోతాడని చెప్పాడు.తన ఇంటికి వెళ్తే మాత్రం తప్పకుండా భోజనం పెట్టే పంపిస్తాడని చెప్పాడు.

స్టూడెంట్ నెంబర్ 1 సినిమాలో మూడు సీన్లు చేస్తే.రెండు ఎడిటింగ్ లో ఎగిరిపోయినట్లు చెప్పాడు శేఖర్.దీంతో చాలా బాధపడినట్లు వెల్లడించాడు.ఈ విషయం రాజమౌళికి తెలిసిందన్నాడు.
వెంటనే వచ్చి.భుజం మీద చెయ్యి వేసి పక్కకు తీసుకెళ్లాడని చెప్పాడు.
ఈ సినిమాలో పోతే ఏంది? మిగతా సినిమాల్లో చాలా సీన్లు చెయ్యొచ్చని ధైర్యం చెప్పినట్లు శేఖర్ వెల్లడించాడు.