ఒక అబ్బాయి ఒక్క లవర్‌ను మెయింటెన్ చేయడమే కష్టం.లవర్ ఉంటే ఎన్ని కష్టాలు ఉంటాయో దర్శకుడు అనీల్ రావిపూడి ‘ఎఫ్ 2’ చిత్రంలో చాలా ఫన్నీగా చూపించాడు.
అలాంటిది వీడు ఏకంగా 14 మంది అమ్మాయిలను ప్రేమలో పడేశాడు.వారితో తెగ ఎంజాయ్ చేయడం మొదలు పెట్టాడు.14 మంది అమ్మాయిలను ప్లాట్ చేసిన ఈ కుర్రాడి వయసు ఎంతో తెలిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే.అతడి వయసు కేవలం 18 ఏళ్లు మాత్రమే.
ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణం సాగించిన ఇతగాడి బండారం బట్ట బయలు అయ్యింది.ప్రేమికుల రోజున ఇతడికి అంతా కలిసి షాక్ ఇచ్చారు.
ఆ షాక్‌తో ఏకంగా కోమాలోకి వెళ్లాడు.
రఖీబ్ అనే 18 ఏళ్ల కుర్రాడు 14 మంది అమ్మాయిలతో ప్రేమలో మునిగి తేలుతూ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూ హాయిగా జీవితాన్ని గడుపుతున్నాడు.
ఇలాంటి సమయంలో ఒక అమ్మాయికి అతడి గురించి అనుమానం వచ్చింది.ఫోన్‌లో అతడు వేరు వేరు అమ్మాయిలతో మాట్లాడుతున్నట్లుగా అనుమానించిన ఆ అమ్మాయి ఒకసారి అతడి ఫోన్‌ను చాటుగా చూసింది.
అందులో తన నెంబర్ బార్బీ గర్ల్ 5 అని ఫీడ్ చేసి ఉంది.అలా బార్బీ గర్ల్ 1 నుండి 14 మంది నెంబర్లు ఉన్నాయి.రఖీబ్ చూడకుండా ఆ నెంబర్లన్నీ తీసుకుంది.అందరికి ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత ఆమెకు అర్థం అయిన విషయం ఏంటీ అంటూ వారందరితో కూడా రఖీబ్ ప్రేమలో ఉన్నాడు.
ఆ 14 మంది కూడా ప్లాన్ చేసి ఫిబ్రవరి 14న అతడికి షాక్ ఇవ్వాలనుకున్నారు.14వ తారీకున ఉదయం రఖీబ్ లేవక ముందే అతడి ముందు నిల్చోవాలనుకున్నారు.ప్లాన్ చేసుకున్న ప్రకారం ఒక్కరొక్కరుగా అంతా కూడా అతడి ఇంటికి చేరుకున్నారు.ఉదయాన్నే అంతా కలిసి అతడి ఇంటికి వెళ్లారు.కుటుంబ సభ్యులు వారిస్తూ ఉన్నా కూడా అంతా లోనికి వెళ్లారు.అతడి రూంలోకి వెళ్లారు.
అతడు అలికిడికి లేచాడు.కళ్ల ముందు 14 మంది అమ్మాయిలు, అది కూడా తాను ప్రేమిస్తున్నట్లుగా చెప్పిన అమ్మాయిలు ఉండటంతో అవాక్కయ్యాడు.
ఒక్కసారిగా వారంతా కనిపించేప్పటికి హార్ట్ వేగం పెరిగి ఏకంగా కోమాలోకి వెళ్లాడు.ఇప్పుడు అతడి ఆరోగ్య పరిస్థితి వెంటనే బాగు పడాలని ఆ 14 మంది అమ్మాయిలు కోరుకుంటున్నారు.