ఆరోగ్యానికి బొప్పాయి( Papaya ) చేసే మేలు అంతా ఇంతా కాదు.పోషకాలకు బొప్పాయి పండు పవర్ హౌస్ లాంటిది.
బొప్పాయిలో అనేక రకాల విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్, ఫైబర్ ఇలా ఎన్నో పోషక విలువలు నిండి ఉంటాయి.అందువల్ల చాలా మంది బొప్పాయిని తమ డైట్ లో భాగం చేసుకుంటారు.
అయితే ఆరోగ్యానికి మాత్రమే కాదు జుట్టును ఒత్తుగా పెంచడంలోనూ బొప్పాయి పండు అద్భుతంగా తోడ్పడుతుంది.అందుకు బొప్పాయిని ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా బాగా పండిన బొప్పాయి పండును తీసుకుని పీల్ మరియు సీడ్స్ ను తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక కప్పు బొప్పాయి పండు ముక్కలు వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు వేపాకు పొడి( Neem powder ) మరియు రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.
గంట అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా తలస్నానం చేయాలి.ఈ బొప్పాయి మాస్క్ ను వారానికి ఒకసారి వేసుకోవడం వల్ల అదిరే బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.బొప్పాయి మరియు వేపలో ఉండే పోషకాలు, ఔషధ గుణాలు జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి.జుట్టు రాలడాన్ని అడ్డుకుంటాయి.అలాగే బొప్పాయి హెయిర్ గ్రోత్ ను ప్రోత్సహిస్తుంది.పల్చటి కురులను ఒత్తుగా మారుస్తుంది.
వేప చుండ్రు( Dandruff )ను నివారిస్తుంది.స్కాల్ప్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
కొబ్బరి నూనె హెయిర్ ను హైడ్రేట్ చేస్తుంది.డ్రై నెస్ ను తగ్గిస్తుంది.
కాబట్టి ఆరోగ్యమైన దట్టమైన కురులను కోరుకునే వారు తప్పకుండా ఈ బొప్పాయి హెయిర్ మాస్క్ ను ప్రయత్నించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.