నయనతార విఘ్నేష్ శివన్ ధనుష్ ను( Dhanush ) టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేయగా అదే సమయంలో నయన్ కు ధనుష్ ఫ్యాన్స్ నుంచి ఊహించని స్థాయిలో కౌంటర్లు వస్తుండటం గమనార్హం.అయితే ధనుష్ నయన్ మధ్య గొడవ ఇప్పటిది కాదని తెలుస్తోంది.
నేనూ రౌడీనే మూవీ షూట్ సమయంలో మొదలైన గొడవ నయన్ ధనుష్ మధ్య గ్యాప్ పెంచిందని భోగట్టా.నేనూ రౌడీనే( Nenu Rowdy Ne ) సినిమాకు ధనుష్ నిర్మాతగా వ్యవహరించారు.
అయితే నయన్( Nayanthara ) విఘ్నేష్( Vighnesh ) ప్రేమలో పడి సినిమాను ఆలస్యం చేయడం ధనుష్ కు నచ్చలేదు.ఆ సమయంలో వాళ్లు లవ్ చేసుకోవడానికి నేను డబ్బులు పెట్టి సినిమా తీయాలా అని ధనుష్ ఫీలయ్యారట.
ఆ సమయంలో ఇచ్చిన బడ్జెట్ దాటిపోవడంతో ధనుష్ అసహనానికి లోను కావడంతో పాటు షూట్ ను సైతం ఆపేశారని సమాచారం.

నేనూ రౌడీనే మూవీకి ఉత్తమ నటిగా నయనతారకు అవార్డ్ వచ్చిన సమయంలో సైతం నయనతార ధనుష్ ను విమర్శిస్తూ కొన్ని కామెంట్లు చేయడం జరిగింది.నయనతార బిహేవియర్ నచ్చకపోవడం వల్లే నేనూ రౌడీనే మూవీ షాట్స్ డాక్యుమెంటరీలో వాడుకోవడానికి ధనుష్ అంగీకరించలేదని భోగట్టా.నయన్ పై ధనుష్ పరువు నష్టం దావా కూడా వేయవచ్చని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ధనుష్ నయనతార భవిష్యత్తులో కలిసి పని చేసే అవకాశం అయితే లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.నయనతార డాక్యుమెంటరీకి స్వయంగా నిర్మాతగా ఆమెనే వ్యవహరిస్తూ ఉండటంతో ఆమె ఈ తరహా వివాదానికి తెరలేపారని కామెంట్లు వినిపిస్తున్నాయి.ధనుష్ ప్రస్తుతం కుబేర ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.కుబేర సినిమాకు శేఖర్ కమ్ముల డైరెక్టర్ కాగా రష్మిక ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు.
ఈ మూవీలో నాగార్జున కీలక పాత్రలో నటిస్తుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.







