కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలకు గుర్తింపు పొందిన ధనుష్( Dhanush ) నయనతార( Nayanatara ) మధ్య వివాదం చెలరేగుతుంది.గత రెండు రోజులుగా వీరి వ్యవహారం సోషల్ మీడియాలోనూ అటు తమిళ చిత్ర పరిశ్రమలోనూ హాట్ టాపిక్ గా మారింది.
నయనతార జీవిత చరిత్రను ఒక డాక్యుమెంటరీగా రూపొందించి విడుదల చేయడానికి సిద్ధమైంది ఇందులో భాగంగా నయనతార చిన్నప్పటి నుంచి జరిగిన సంఘటనలను అలాగే ఆమె నటించిన సినిమాలలోని కొన్ని క్లిప్స్ కూడా ఈ డాక్యుమెంటరీలో రూపొందించారు.ఈ క్రమంలోనే ధనుష్ నిర్మాణంలో విగ్నేష్ శివన్( Vignesh Shivan ) దర్శకత్వంలో నయనతార నటించిన నానుమ్ రౌడీ దానే అనే సినిమా నుంచి మూడు సెకండ్ల వీడియో క్లిప్ తీసుకున్నారు.

ఈ సినిమా నయనతార జీవితంలో ఎంతో కీలకమైనది ఈ సినిమా ద్వారా విగ్నేష్ పరిచయం కావడం ప్రేమించుకుని పెళ్లి చేసుకోవడం వంటివి జరిగింది అందుకే ఈ సినిమాలో కొన్ని క్లిప్స్ తన డాక్యుమెంటరీలో చేర్చాలని నయనతార విగ్నేష్ ని అడిగినప్పటికీ ఆయన మాత్రం ఎన్ ఓసీ సర్టిఫికెట్ ఇవ్వలేదు.ధనుష్ ఇవ్వకపోయినా నయనతార మాత్రం ఆ సన్నివేశాలను చేర్చింది.ఇటీవల ఈ డాక్యుమెంటరీ నుంచి విడుదల చేసిన టీజర్ చూసిన ధనుష్ తనకు పది కోట్ల రూపాయల లీగల్ నోటీసులను జారీ చేశారు.ఈ విషయంపై నయనతార ఏకంగా మూడు పేజీల లేఖను విడుదల చేశారు.

ఈ క్రమంలోనే ధనుష్ సైతం సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు.ద్వేషాన్ని కాదు ప్రేమను పంచండి కనీసం మీరంటే పడి చచ్చే అభిమానుల కోసమైనా మారండి.మనుషులు మారాలని ఎదుటి వ్యక్తి సంతోషంలో కూడా ఆనందం వెతుక్కోవాలని ప్రార్థిస్తున్నాను అంటూ పోస్ట్ చేశారు.ఈ పోస్ట్ చేసిన కాసేపటికే డిలీట్ చేశారు.ఈ వివాదానికి కారణమైన వీడియో క్లిప్‌ను విఘ్నేశ్ శివన్ ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేశారు.దీని కోసమే రూ.10 కోట్లు డిమాండ్ చేశారు.దీనిని మీరు ఇక్కడ ఉచితంగా చూడొచ్చు అంటూ ఈయన చెప్పుకువచ్చారు అయితే ఈ వివాదంలో పలువురు సినీ సెలబ్రిటీలు నయనతారకు మద్దతు తెలియజేస్తున్నారు.
మరికొందరు మాత్రం ఈమె వ్యవహార శైలినీ తప్పుపడుతున్నారు.