టూత్ పేస్ట్ లో వీటిని కలిపి వాడితే ఎలాంటి పసుపు దంతాలైనా తెల్లగా మెరుస్తాయి!

తెల్లటి మెరిసే దంతాలను ఎవరు కోరుకోరు చెప్పండి.అటువంటి దంతాలు మనల్ని, మన చిరునవ్వును మరింత అందంగా చూపిస్తాయి.

 If These Are Used Together In Toothpaste , The Teeth Will Shine White , Teeth-TeluguStop.com

అందుకే ముత్యాల్లాంటి దంతాల కోసం ప్రతి ఒక్కరూ ఆరాటపడుతూ ఉంటారు.ఖ‌రీదైన టూత్ పేస్ట్ ల‌ను కొనుగోలు చేసి వాడుతుంటారు.

కానీ ఎంత ప్రయత్నించినా సరే కొందరి దంతాలు పసుపు రంగులోనే ఉంటాయి.ఇలాంటివారు లోలోన చాలా మధన పడుతూ ఉంటారు.

నలుగురిలో నవ్వాలన్నా మాట్లాడాలన్నా సంకోచిస్తూ ఉంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే అస్సలు వర్రీ అవకండి.

Telugu Tips, Remedy, Latest, Oral, Teeth Remedy, Yellow Teeth-Telugu Health

టూత్ పేస్ట్ లో ఇప్పుడు చెప్పబోయే పదార్థాలను కలిపి వాడితే ఎలాంటి పసుపు దంతాలైనా( Yellow teeth ) తెల్లగా మెరిసిపోవడం ఖాయం.మరి ఇంకెందుకు ఆలస్యం సులభంగా దంతాలను ఎలా తెల్లగా మెరిపించుకోవచ్చో తెలుసుకుందాం ప‌దండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు వైట్ టూత్ పేస్ట్ ( White toothpaste )ను వేసుకోవాలి.

Telugu Tips, Remedy, Latest, Oral, Teeth Remedy, Yellow Teeth-Telugu Health

అలాగే పావు టేబుల్ స్పూన్ సాల్ట్, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, ( Lemon juice )వన్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి తురుము,( Garlic ) హాఫ్ టేబుల్ స్పూన్ ఆవనూనె( Mustard oil ) వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బ్రష్ సహాయంతో దంతాలకు అప్లై చేసి సున్నితంగా రెండు నుంచి మూడు నిమిషాల పాటు తోముకోవా ఆపై వాటర్ తో శుభ్రంగా దంతాలను మరియు నోటిని క్లీన్ చేసుకోవాలి.ఇలా రోజుకు ఒకసారి కనుక చేస్తే గార పట్టి పసుపు రంగులోకి మారిన దంతాలు( Teeth ) తెల్లగా ముత్యాల మాదిరి మెరుస్తాయి.కొద్ది రోజుల్లోనే మీరు మంచి రిజల్ట్ ను గమనిస్తారు.

పైగా ఇప్పుడు చెప్పిన విధంగా రోజూ బ్రష్ చేసుకుంటే చిగుళ్ల నుంచి రక్తస్రావం, చిగుళ్ల వాపు, దంతాల పోటు వంటి సమస్యలు ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. చిగుళ్ళు మ‌రియు దంతాలు ఆరోగ్యంగా మారతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube