అవును, మీరు విన్నది నిజమే.ఒక్కోసారి మనం తెలిసో తెలియకో చేసిన పొరపాటు జీవితాంతం మర్చిపోలేని మాయని మచ్చగా మిగిలిపోతుంది.
కొద్ది రోజుల క్రితం అమెరికాకు చెందిన ఓ మహిళ అలా తెలియక చేసిన చిన్న పొరపాటు ఆమెకు కన్నీటి వ్యధను మిగిల్చింది.ఆమె కంటి నొప్పి వచ్చినపుడు ఐ డ్రాప్స్( Eye drops ) కు బదులుగా నెయిల్ గ్లూ ( Nail glue )కంట్లో వేసుకుంది.
ఆ తర్వాత ఆమె నరకం అనుభవించింది.కాగా అలాంటి బాధ మరెవ్వరకూ రాకూడదని ఆ మహిళ తన బాధను వివరిస్తూ ట్విటర్‌లో ఓ వీడియో పోస్ట్ చేసింది.
ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
విషయం ఏమిటంటే కాలిఫోర్నియాలోని శాంటా రోసాలో( Santa Rosa, California ) నివసిస్తున్న జెన్నిఫర్ ఎవర్సోల్ ( Jennifer Eversole )అనే మహిళ కళ్లు బిగుసుకుపోవడంతో గత వారం హాస్పిటల్‌కు వెళ్లి చూపించుకుంది.ఆమె పరిస్థితి చూసి వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు.వైద్యులు వెంటనే ఎవర్సోల్ కళ్లు తెరవడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు.
మందులు ప్రయోగించారు.కానీ వీధి ఆమెని వంచించింది.
ఆ మందులు పనిచేయలేదు.చివరికి డాక్టర్లు ఆమె కనురెప్పలు కొయ్యాల్సి వచ్చింది.
కంటి నొప్పి వచ్చినపుడు జెన్నిఫర్ ఐ డ్రాప్స్ అనుకుని నెయిల్ పాలిష్ వేసుకోవడానికి ముందు వేసుకునే జిగురును కంట్లో వేసుకుంది.దాంతో ఆమె కనురెప్పలు అతుక్కుపోయాయి.
హుటాహుటిన ఆమెను కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తీసుకువెళ్లినా లాభం లేకపోయింది.ఆమె పరిస్థితి చూసి డాక్టర్లు కూడా చలించిపోయారు పాపం.ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమె కంటి రెప్పలు విడలేదు.దీంతో ఆమె కంటి రెప్పలను కొసెయ్యాల్సినా పరిస్థితి వచ్చింది.దాంతో ఆమె తను చేసిన పొరపాటు ఇంకెవ్వరూ చేయొద్దని పేర్కొంటూ జెన్నిఫర్ ఓ వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేసింది.ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఆ వీడియోను ఇప్పటివరకు 3.3 లక్షల మందికి పైగా వీక్షించారు.ఈ క్రమంలో చాలామంది నెటిజనం ఆమెని ఓదార్చుతున్నారు.