ఆడవారు తమ మొత్తం జీవితంలో మానసికంగా, శారీరకంగా ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఫేస్ చేయాలంటే కచ్చితంగా మంచి ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం.అయితే ఆడవారికి( Women ) అత్యంత మేలు చేసే ఫుడ్స్ లో మెంతులు( Fenugreek Seeds ) ఒకటి.
దాదాపు అందరి వంటింట్లో మెంతులు ఉంటాయి.అయితే వీటి ప్రయోజనాలు తెలియక చాలా మంది మెంతలను చిన్న చూపు చూస్తుంటారు.
నిజానికి మెంతులు చేదుగా ఉన్న కూడా బోలెడు ఆరోగ్య లాభాలను అందిస్తాయి.ముఖ్యంగా ఆడవారికి మెంతులు ఒక వరమనే చెప్పుకోవచ్చు.
అవును, ఆడవారు రోజుకో స్పూన్ మెంతలను గ్లాస్ వాటర్ లో నైట్ అంతా నానబెట్టి ఉదయాన్నే తీసుకుంటే శరీరంలో అద్భుతాలు జరుగుతాయి.
ఇటీవల రోజుల్లో ఎక్కువశాతం మంది ఆడవారు నెలసరి( Periods ) సమస్యలతో సతమతం అవుతున్నారు.
అయితే మెంతులు క్రమరహిత నెలసరి, పిసిఒఎస్, పిసిఒడి వంటి సమస్యలకు చెక్ పెట్టడంలో తోడ్పడతాయి.గర్భాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.అలాగే మెంతులు ఎస్ట్రోజెన్ లెవల్స్‌ను నియంత్రించి హార్మోన్ల సమతుల్యతను కాపాడతాయి.మెనోపాజ్( Menopause ) సమయంలో వచ్చే ఇబ్బందులను తగ్గించడానికి కూడా మెంతులు ఉపయుక్తంగా ఉంటాయి.

డెలివరీ అనంతరం మహిళలు మెంతలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే తల్లిపాలు ఉత్పత్తి పెరుగుతుంది.అలాగే మహిళల్లో శక్తి స్థాయిలను పెంచేందుకు మెంతులు అద్భుతంగా ఉపయోగపడతాయి.ఒక స్పూన్ మెంతలను నైట్ అంతా గ్లాస్ వాటర్ లో నానబెట్టి ఉదయాన్నే తీసుకుంటే.అందులో ఉండే ఐరన్, మెగ్నీషియం వంటి ఖనిజాలు శక్తిని పెంచి అలసటను దూరం చేస్తాయి.

మెంతులు మధుమేహ నియంత్రణలో మరియు శరీర బరువును సమతుల్యం చేయడంలో ఉపయోగపడతాయి.న్యాచురల్ ఫైబర్ అధికంగా ఉండటంతో జీర్ణవ్యవస్థను మెరుగుపరిచే గుణం మెంతులకు ఉంది.మెంతులను నిత్యం తీసుకుంటే మలబద్ధకం దూరం అవుతుంది.ఆమ్లత్వం, కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి.అంతేకాకుండా మెంతులు ఒత్తిడిని తగ్గించి మెదడు కార్యచర్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి.