ఇటీవల ఏపీలో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి నేతల గురించి గతంలో ప్రస్తుతం అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేసే వారిపై చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే .ఈ క్రమంలోనే ప్రముఖ సంచలనాత్మక దర్శకుడు రాంగోపాల్ వర్మ( Ram Gopal Varma ) పై కూడా కేసులు నమోదు అయ్యాయి.
ఇలా రాంగోపాల్ వర్మ పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు నాయుడు ఫోటోలను ఎడిట్ చేస్తూ అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం పట్ల ఈయన పై కేసు నమోదు చేశారు.

ఈ క్రమంలోనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్వయంగా హైదరాబాద్ రామ్ గోపాల్ వర్మ ఇంటికి వెళ్లి మరి ఆయనకు నోటీసులు అందజేశారు.ఈనెల 19వ తేదీ విచారణకు హాజరుకావాలని సూచించారు.ఇలా రాంగోపాల్ వర్మపై కేసు నమోదు అయినప్పటికీ ఈయన ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో రిపోర్టర్స్ కేసు గురించి ప్రశ్నించగా ఏ విధమైనటువంటి స్పందన తెలియజేయలేదు.ఇకపోతే రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ మాత్రం వైరల్ అవుతుంది.

సోషల్ మీడియా వేదికగా తరచూ కూటమి నేతల గురించి విమర్శలు చేస్తూ పోస్టులు చేసే వర్మ తాజాగా బాలకృష్ణ( Balakrishna ) గురించి ప్రశంసలు కురిపిస్తూ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది.ఇటీవల బాలకృష్ణ 109వ సినిమా టైటిల్, టీజర్ లాంచ్ చేసిన సంగతి మనకు తెలిసిందే.డాకు మహారాజా( Daku Maharaj ) టీజర్ చూసినటువంటి వర్మ టీజర్ పై ప్రశంసలు కురిపించారు.ఈ సినిమా టీజర్ హాలీవుడ్ సినిమాని తలపిస్తుంది.కేవలం విజువల్స్ మాత్రమే కాకుండా ఎమోషన్స్ లో కూడా ఇతిహాసం ఉంది.బాలయ్య ఇంత క్లాసీగా పవర్ ఫుల్ గా కనిపిస్తారని ఎప్పుడూ అనుకోలేదు.
ఈ సంక్రాంతికి విడుదల అయ్యే ఈ సినిమా వచ్చే సంక్రాంతి వరకు ఆడుతుంది అంటూ ట్వీట్ చేయడంతో కేసుల ఎఫెక్ట్ అంటూ వర్మ ట్వీట్ పై నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.







