ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి నటుడిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు విశ్వక్ సేన్( Vishwak Sen ) ఒకరు.ఈయన ఇటీవల వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇక త్వరలోనే విశ్వక్ నటించిన మెకానిక్ రాఖీ( Mechanic Rocky ) అనే సినిమా ద్వారా ఈయన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ సినిమా నవంబర్ 22వ తేదీ విడుదల కాబోతోంది.
ఇలా ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా విశ్వక్ సేన్ తన సినిమాల ఎంపిక గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.సినిమా హిట్ కావాలా లేదా అనేది పూర్తిగా కథల ఎంపిక( Story Selection ) విషయంపైనే ఆధారపడి ఉంటుంది.ఈ కథల ఎంపిక విషయంలో ఏ మాత్రం తడబడిన సినిమా భారీ నష్టాలను ఎదుర్కొక తప్పదు.
అందుకే సెలబ్రిటీలు కథ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.అయితే విశ్వక్ మాత్రం ఒక సినిమా కథ వినడానికి ముందు ఆ సినిమాని ఎలా రిజెక్ట్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారట.
సినిమాలను రిజెక్ట్ చేయడం కోసమే నేను కథలను వింటాననే ఉద్దేశంతో ఈయన మాట్లాడారు.ఒక సినిమా కథ వింటున్నప్పుడు ఆ సినిమాని ఏ కారణాల చేత రిజెక్ట్ చేయాలి అందులో ఎక్కడ లోపాలు ఉన్నాయి అనే విషయాల గురించి నేను ఆలోచించి కథను కూడా అదే కోణంలోనే వింటాను.ఇలా కథ విన్నప్పటికీ ఆ సినిమా చేయాలి అనిపించింది అంటేనే నేను సినిమా చేస్తానని అందుకే నా సినిమాలు మంచి సక్సెస్ అందుకుంటాయంటూ విశ్వక్ ఈ సందర్భంగా తన సినిమాల ఎంపిక గురించి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.