పుష్ప 2 ప్రమోషన్ కోసం అన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారా... ఇది మామూలు క్రేజ్ కాదు?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) హీరోగా నటించిన పుష్ప 2( Pushpa 2 ) సినిమా డిసెంబర్ ఐదో తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతుంది.ఇక ఈ సినిమా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలకు కూడా అలాగే ఉన్నాయి.

 Pushpa 2 Makers Spent 150 Cr For Pramotions Details,pushpa 2,pushpa 2 Pramotions-TeluguStop.com

పుష్ప సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ సినిమాగా రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి.ఇప్పటికే విడుదల చేసిన అప్డేట్స్ సినిమాపై ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది ఇకపోతే నేడు సాయంత్రం సినిమా ట్రైలర్( Pushpa 2 Trailer ) విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే.

Telugu Allu Arjun, Sukumar, Pushpa, Pushpa Trailer, Sreeleela-Movie

ఇక ఈ సినిమా విడుదలకు 20 రోజులకు కూడా సమయం లేదు.ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఈ సినిమాని భారీ స్థాయిలో ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది.ఈ క్రమంలోనే కొన్ని పట్టణాలలో పెద్ద ఎత్తున ఈవెంట్లు అలాగే ప్రెస్ మీట్ కార్యక్రమాలను నిర్వహించేలా మేకర్స్ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తుంది అదే విధంగా కొన్ని బ్రాండ్స్ తో కలిసి కొన్ని నగరాలలో భారీ హోర్డింగ్స్ కూడా ఏర్పాటు చేసే విధంగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.ఇలా ఈ సినిమాని భారీ స్థాయిలో ప్రేక్షకులలోకి తీసుకువెళ్లడం కోసం మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ స్థాయిలోనే ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది.

Telugu Allu Arjun, Sukumar, Pushpa, Pushpa Trailer, Sreeleela-Movie

ఈ సినిమా నిర్మాణం కోసం సుమారు 500 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ల కోసం కూడా భారీ స్థాయిలో ఖర్చుకు సిద్ధమయ్యారని చెప్పాలి.ఈ సినిమా ప్రమోషన్ల కోసం ఏకంగా 150 కోట్ల రూపాయల బడ్జెట్ నిర్మాతలు కేటాయించారట ఇలా ప్రమోషన్ల కోసం ఈ స్థాయిలో ఖర్చు చేస్తున్నారు అంటే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు.ఇక ఈ సినిమా కోసం కేవలం ప్రేక్షకులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube