కడుపు నిండుగా రోజంతా ఎన‌ర్జిటిక్ గా ఉండాలా.. అయితే మీ బ్రేక్ ఫాస్ట్ లో దీనిని చేర్చండి!

సాధారణంగా ప్రతి ఒక్కరూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ, వడ, పూరి, దోస వంటివి తింటుంటారు.ఇవి ఆకలిని తీర్చుతాయి.

 Add This Smoothie In Your Breakfast For Energetic Day! Smoothie, Healthy Smoothi-TeluguStop.com

కానీ ఎక్కువసేపు కడుపును నిండుగా ఉంచలేవు.దాంతో మధ్యాహ్నం కాకముందే చిరు తిళ్ల‌పై మనసు మళ్లుతుంటుంది.

పనిపై ఏకాగ్రత నెమ్మదిస్తుంది.పైగా చిరుతిళ్ల‌ వల్ల బరువు కూడా పెరుగుతారు.

అందుకే బ్రేక్ ఫాస్ట్ లో కడుపు నిండుగా మరియు రోజంతా ఎన‌ర్జిటిక్ గా ఉంచే ఆహారాన్ని తీసుకోవాలి.అటువంటి వాటిల్లో ఇప్పుడు చెప్పబోయే స్మూతీ ఒకటి.

Telugu Energetic Day, Tips, Latest, Pineapplebanana, Smoothie-Telugu Health Tips

ఈ హై ప్రోటీన్ స్మూతీని బ్రేక్ ఫాస్ట్ లో చేర్చుకుంటే చాలా ఆరోగ్య లాభాలు ఉన్నాయి.మరి ఇంతకీ ఆ స్మూతీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు రోల్డ్ ఓట్స్ వేసి వాటర్ పోసి అరగంట పాటు నానబెట్టుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకొని అందులో నానబెట్టుకున్న ఓట్స్ వేసుకోవాలి.

అలాగే అరకప్పు అరటి పండు ముక్కలు( Banana slices ), అర కప్పు పైనాపిల్ ముక్కలు, ఒక గ్లాస్ ఇంట్లో తయారు చేసుకున్న బాదం పాలు, వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.తద్వారా మన స్మూతీ సిద్ధమవుతుంది.

Telugu Energetic Day, Tips, Latest, Pineapplebanana, Smoothie-Telugu Health Tips

ఈ స్మూతీలో వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్( Chia seeds ) మిక్స్ చేసి తీసుకోవడమే.ఈ పైనాపిల్ బనానా ఓట్స్ స్మూతీ చాలా రుచిగా ఉండడమే కాదు ఎన్నో రకాల పోషకాలను సైతం కలిగి ఉంటుంది.బ్రేక్ ఫాస్ట్ లో ఈ స్మూతీని చేర్చడం వల్ల ఎక్కువ గంటల పాటు కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ ను అందిస్తుంది.అతి ఆకలిని దూరం చేస్తుంది.

అలాగే రోజంతా ఎన‌ర్జిటిక్ గా ఉండాలి అంటే ప్రోటీన్ ఎంతో అవసరం.అయితే ఈ స్మూతీ ద్వారా శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్ అందుతుంది.

బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారు కూడా ఈ స్మూతీని తీసుకోవచ్చు.పైగా ఈ పైనాపిల్ బనానా ఓట్స్ స్మూతీ ఎముకలను దృఢంగా మారుస్తుంది.

కండరాల నిర్మాణానికి ‌సైతం అద్భుతంగా తోడ్పడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube