ఇంట్లో బల్లి( Lizard ) కనబడగానే చాలామంది చీదరించుకుంటూ ఉంటారు.మరి కొందరు ఒళ్ళు జలదిరించుకున్నట్టు చేస్తారు.
ఇక మరికొందరు భయపడి దూరంగా పారిపోతారు.అయితే చాలామందికి బాల్లికి సంబంధించి ఎన్నో ఆలోచనలు, ఎన్నో ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి.
ఇక చాలామంది బల్లి గురించి కొన్ని చెడు సంకేతాలు, మంచి సంకేతాలు ఉంటాయని కూడా ఆలోచిస్తూ ఉంటారు.అయితే బల్లికి సంబంధించి మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అని మన పెద్దలు మనకు ఎప్పుడు చెబుతూనే ఉంటారు.
అదేవిధంగా బల్లికి సంబంధించిన కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.బల్లి ఎదుర్పడడం, పైన పడటం వలన మనకు కొన్ని విషయాలు తెలుస్తాయని చెబుతారు.
కొందరు దీన్ని బల్లి శాస్త్రం అని కూడా పిలుస్తారు.

అందులో కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చెప్పడం జరిగింది.బల్లి మన మన తల లేదా కుడి చేయిపై బల్లి పడితే, భవిష్యత్తులో మనం ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతాం అని దానికి అర్థం.ఇక మోకాళ్ళపై బల్లి పడితే త్వరలో శుభవార్త వింటామని అర్థం చేసుకోవాలి.
ఇక ఇంట్లో రెండు బల్లులు పోట్లాడుతూ కనిపిస్తే మనం మన జీవితంలో అమితంగా ప్రేమించే వారితో విడిపోతామని దానికి అర్థం.ఇక ఇంట్లో బల్లి చనిపోయి కనిపిస్తే ఆ ఇంట్లో ఉండే వారికి అనారోగ్యం కలుగుతుందని అర్థం.
అంతేకాకుండా పగటిపూట బల్లి అరుపు వినడం కూడా చాలా మంచిది.దీంతో మనకు ఎలాంటి చెడు కలగదు.ఇక ఎవరైనా మహిళ పొట్టపై బల్లి పడితే వారికి త్వరలో గర్భం( Pregnancy ) వస్తుంది.

ఇక పాదాలు లేదా కాలి వేళ్లపై పై బల్లి పడితే కూడా అది మనకు దురదృష్టాన్ని కలిగిస్తుందట.అంతేకాకుండా విపత్కర పరిస్థితులు సంభవించినప్పుడు బల్లులు విచిత్రంగా ప్రవర్తిస్తూ మనకు కనిపిస్తాయి.ఇక ఏదైనా సమస్య పరిష్కరించుకోవాలనుకుంటే ఆ సమయంలో బల్లి కనబడితే అప్పుడు ఆ సమస్యను వదిలేయడమే మంచిది.
ఇక మనం ఏదైనా పని చేయాలని సిద్ధమవుతున్నప్పుడు మన దారికి అడ్డంగా బల్లి వస్తే మనం సరిగ్గా నిద్రపోవడం లేదని దానికి అర్థం.ఈ విధంగా బల్లుల గురించి బల్లి శాస్త్రం( Balli sastram )లో చాలా వివరంగా చెప్పడం జరిగింది.