మనదేశంలో చాలామంది కాఫీ ప్రియులు ఉన్నారు.వాళ్ళకి ఉదయాన్నే లేచి కాఫీ తాగనిదే రోజు గడవదు.
అంతలా కొంతమంది కాఫీకి అలవాటు పడిపోయారు.అయితే ఇప్పుడు చెప్పబోయే విషయం తెలుసుకుంటే.
మీరు చాలా సంతోషపడతారు.అదేంటంటే, ఉదయాన్నే లేచి కాఫీ తాగే కాఫీ ప్రియులు కరోనాను ముందే పసిగట్టేస్తున్నారట.
ఏంటి.? కాఫీ తాగితే కరొనాను ఎలా పసిగడతారు అనేకదా మీ డౌట్మీ రు అలా అనుకోవడంలో తప్పులేదు.ఎందుకంటే, ఇప్పటివరకు కరోనా గురించి ఎన్నో రకాల ఫేక్ వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి.వాటిలో ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో అనే అయోమయంలో మీరు ఉండడంలో తప్పులేదు.
అయితే, తాజాగా నిర్వహించిన ఈ స్టడీ గురించి తెలిస్తే.మీకు కొంచెం ధైర్యం వస్తుంది.
ఆ అధ్యయనంలో ఏం తేలిందో చూసేద్దామా
కోవిడ్-19 సోకినవారిలో జలుబు, దగ్గుతోపాటు వాసన, రుచి కోల్పోవడం తదితర లక్షణాలు కనిపిస్తాయనే సంగతి ముందే తెలిసిందే.అయితే, ఈ లక్షణాలు అందరూ అన్నివేళలా గుర్తించకపోవచ్చు.
కొంతమందికి వైరస్ సోకినా.వైరస్ గురించి ముందుగా తెలియడం లేదని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో కొంతమంది కోవిడ్-19 బాధితులు ఎప్పటికప్పుడు వాసన, రుచిని చూస్తుండటం ద్వారా కోవిడ్-19 లక్షణాలు ఉన్నాయా లేదనేది తెలుసుకోవచ్చని అంటున్నారు.అది ఎలా అంటే.
కాఫీ స్నిఫ్ చేసే అలవాటు ఉంటే.తప్పకుండా కరోనాను పసిగట్టేయోచ్చని తెలుపుతున్నారు.
కరోనా టెస్టుకు కాఫీ ఎలా ఉపయోగపడుతుందో చూస్తే.కాఫీని ఇష్టంగా తాగేవారిని మీరు చూస్తే వాళ్ళు రుచి కంటే ముందు వాసనను బాగా ఆస్వాదిస్తారు.
ముక్కు నిండుగా కాఫీ ఆవిరి పీల్చి, ఆ టేస్టును వాసనతోనే పసిగట్టేస్తారు.అప్పుడు ఆ వాసన మైండ్ లో అలా ఉండిపోతుంది.
అందుకనే కాబోలు వారు చిన్న స్నిఫ్ ను కూడా అమృతంలా ఫీలవ్వుతారు.ఇప్పుడు ఈ పక్రియనే కోవిడ్-19ను సులభంగా పసిగట్టేందుకు ఉపయోగపడుతుంది.
ఇలా మీరు కాఫీని వాసన చూస్తూ రుచి చూడానికి ప్రయత్నించేప్పుడు ఏమైనా తేడాగా అనిపిస్తే కోవిడ్-19 అని అనుమానించండి.ఎప్పటిలా కాఫీ వాసన లేదా రుచిని తెలుసుకోడానికి మీకు ఏమన్నా ఇబ్బందిగా అనిపిస్తే.
తప్పకుండా కరోనా వైరస్ టెస్ట్ చేయించుకోండి.కరోనా వైరస్ వల్ల రుచి, వాసన పసిగట్టనివారిని పరీక్షించేందుకు పరిశోధకులు ఎక్కువగా కాఫీనే ఉపయోగిస్తున్నారట.

వైరస్ సోకినవారు ఆ స్మెల్‌ను ఫీల్ కాలేక ఇబ్బందిపడటాన్ని చూశామని పరిశోధకులు అంటున్నారు.‘‘కాఫీ టెస్ట్ ద్వారా..కరోనా వైరస్ లక్షణాలను ముందుగానే పసిగట్టడం సులభం అయ్యిందని పరిశోధకులు చెబుతున్నారు.కాఫీ రుచి, వాసన చెప్పడానికి ఇబ్బందిపడిన వ్యక్తులను పరిశీలిస్తే వారికి కోవిడ్-19 ఉన్నట్లు తేలింది.కాబట్టి.
ఎవరికైనా ఇకపై వైరస్ గురించి ఆందోళన ఉంటే ఇలా ‘కాఫీ’ టెస్ట్ చేసుకోండి.