ఆ 500 ఏళ్ల ఆలయంలో మూడు దశాబ్దాలుగా అద్భుతం

మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలోని ఖిల్చిపూర్ పట్టణంలో కూడా ఒక అద్భుతమైన ఆలయం ఉంది.హనుమాన్ జయంతి రోజున పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు ఈ ఆలయం పేరు ఖాదీ బావోరీ హనుమాన్ మందిర్.

 Madhya Pradesh Khadi Bawadi Hanuman Mandir Details, Hanuman Mandir, Sankat Mocha-TeluguStop.com

హనుమాన్ జయంతి రోజు ఉదయం నుంచే ఈ ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది.ఈ ఆలయం చాలా పురాతనమైన హనుమంతుని ఆలయం.

ఆలయ చరిత్ర గురించి ప్రస్తావించాల్సివస్తే.ఖిల్చిపూర్ రాజు ఉగ్రసేన్ 1544లో నగరాన్ని స్థాపించినప్పుడు, ఖేడపాటి హనుమాన్ దేవాలయం నెలకొల్పాడు.

ఇది పురాతన హనుమాన్ దేవాలయం.సుమారు 500 సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయంలో వీర్ హనుమాన్ అద్భుత విగ్రహం రూపంలో దర్శనమిస్తాడు.

31 ఏళ్లుగా ఆలయంలో అఖండ జ్యోతి వెలుగుతుంటుంది.అలాగే అఖండ పారాయణం జరుగుతుంది.

ఆలయంలోని హనుమంతుని విగ్రహాన్ని భక్తులు ఒక అద్భుతంగా భావిస్తారు.ఇక్కడి హనుమంతుడిని దర్శంచుకున్న తరువాత పలువురు భక్తుల జీవితాల్లోని సంక్షోభాలు తొలగిపోయాయని స్థానికులు చెబుతుంటారు.

ఈ విగ్రహాన్ని చూడగానే మనస్సుకు అసమానమైన శాంతి అనుభూతిని కలుగుతుంది.పురాతన కాలంల, ఈ విగ్రహం చిన్న వేదికపై ఉండేది.

భక్తుల అహర్నిశలు శ్రమించి భారీ ఆలయాన్ని నిర్మించారు.

ఈ హనుమాన్ ఆలయానికి సమీపంలో భారీ శివాలయాన్ని నిర్మించారు.

దీంతో ఆలయ సముదాయం మరింత శోభాయమానంగా మారింది.సంకట్ మోచకుడైన హనుమంతుడు మన జీవితంలోని ప్రతి సమస్యను పరిష్కరిస్తాడని భక్తులు చెబుతారు.

పురాతన ఆలయంలో 1991 నుంచి ప్రజల సహకారంతో అఖండ జ్యోతి వెలుగుతుండటంతో పాటు అఖండ రామాయణ పారాయణం కొనసాగుతోంది.ఫలితంగా ఈ ప్రదేశం అద్భుత ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది.

అఖండ రామాయణ పఠనం చేసేందుకు, వినేందుకు భక్తులు సమీపంలోని వివిధ ప్రాంతాల నుండి వస్తుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube