జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రంగు పాద రక్షకాలను ధరించకూడదు..

ప్రస్తుతం ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతుంది.మారుతున్న కాలానికి అనుగుణంగా మనుషులు కూడా మారుతూ వస్తున్నారు.

 As Per Astrology This Color Foot Wear Should Not Be Worn , Astrology , Financ-TeluguStop.com

వారి  జుట్టు నుంచి పాదరక్షకాల వరకు అన్ని విషయాలలో ప్రజలు మారుతూ వస్తున్నారు.అయితే అది వారి జీవితాన్ని ప్రభావితం చేస్తుందనీ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా వారు ధరించే చెప్పులు, బూట్ల రంగులు కూడా వారి జీవితంపై ప్రభావం చూపుతాయని జ్యోతిష్యా నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అయితే ఈ మెరకు రంగురంగుల బూట్లు లేదా చెప్పులు ఎందుకు ధరించకూడదు.అలా ధరిస్తే దురదృష్టం, ఆర్థిక సమస్యలు ఎందుకు వెంటాడుతాయి.జీవితంలో సమస్యలు తెచ్చిపెట్టే ఆ రంగుల చెప్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక వ్యక్తి పాదాలలో శని నివసిస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.అటువంటి పరిస్థితిలో బూట్లు, చెప్పులు శని, రాహు, గ్రహాలకు సంబంధించినవి.

ఎవరి రాశిలో శని, రాహువు ఉచ్ఛస్థితిలో ఉన్నారో, అలాంటి వ్యక్తులు బూట్లు, చెప్పుల వ్యాపారంలో పురోగతిని పొందుతారని చెబుతున్నారు.

పసుపు రంగు చెప్పులు, పసుపు రంగు బూట్లను కొనకూడదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.ఎందుకంటే పసుపు రంగు బృహస్పతి రంగు గా భావిస్తారు.ఈ రంగు బూట్లు లేదా చెప్పులు ధరిస్తే జాతకంలో బృహస్పతి బలహీన పడతాడని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

ఈ కారణంగా ఆర్థిక సమస్యలు తలెత్తుతాయని కూడా చెబుతున్నారు.అంతేకాకుండా ఖర్చు భారీగా పెరిగి ఆదాయం తగ్గుతుందని చెబుతున్నారు.అంతేకాకుండా పిల్లల పెళ్లి, వివాహ జీవితానికి సంబంధించిన సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు.ఒక వ్యక్తి యొక్క చంద్రుడు చెడు స్థానంలో ఉంటే అటువంటి వ్యక్తులు తెలుపు రంగు బూట్లు ధరించకూడదు.

ఎవరైనా చెప్పులను బహుమతిగా ఇస్తే వాటిని ఎట్టి పరిస్థితులలో ధరించకూడదు.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నలుపు, నీలం, ఊదా రంగులో ఉన్న బూట్లను ధరించవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube