ఎండాకాలం, వానాకాలం, చలికాలంలో సూర్యోదయంలో కాస్త తేడాలు ఉంటాయి.సూర్య అస్థమయ సమయాల్లో కూడా తేడాలు ఉంటాయి.
కాని మన ఇండియా మొత్తంలో కూడా ఒకే సమయంలో సూర్యడు ఉదయించడం, సూర్యుడు అస్థమించడం జరుగుతుంది.కాని తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లాలోని ఒక గ్రామంలో మాత్రం విచిత్రంగా సూర్యోదయం దాదాపు గంట ఆలస్యం అవ్వడంతో పాటు, సూర్యస్థమయం కూడా రెండు గంటలకు ముందే అవుతుంది.
ప్రపంచంలోనే అత్యంత వింత గ్రామం తెలంగాణ రాష్ట్రంలో ఉండటం విశేషం.
ఇంతకు ఆ గ్రామం విశిష్టత ఏంటంటే…
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కొదురుపాక అనే చిన్న పల్లెటూరు ఉంది.
ఆ పల్లెటూరుకు నాలుగు వైపుల కూడా కొండలు ఉన్నాయి.తూర్పున గొల్లగుట్ట, పడమరన రంగనాయకుల గుట్ట, ఉత్తరాన నంబులాద్రి గుట్ట, దక్షిణాన పాంబండ గుట్ట ఉంటుంది.చుట్టు నాలుగు వైపుల కూడా గుట్టలు ఉండటం ఈ ఊరిని ప్రత్యేకంగా మార్చేసింది.ఈ గ్రామ ప్రజలు ప్రపంచం కంటే ఆలస్యంగా సూర్యోదయంను చూడటంతో పాటు, ఈ ఊరి జనాలు సూర్యస్థమయం చూసిన తర్వాత ఇతర ప్రపంచం చూస్తుంది.
తూర్పున ఉన్న గొల్లగుట్ట కారణంగా ఆ ఊరి ప్రజలకు సూర్యడు కనిపించడం ఆలస్యం అవుతుంది.అంటే వీరికి సూర్యోదయం దాదాపు 7.30 నిమిషాలకు అవుతుంది.అప్పటి వరకు చీకటిగానే ఉంటుంది.
ఇక సాయంత్రం సమయంలో పడమరన ఉన్న రంగనాయకుల గుట్ట చాటుకు సూర్యడు వెళ్లి పోవడంతో నాలుగు గంటలకే అక్కడ చీకటి వాతావరణం ఏర్పడుతుంది.సాయంత్రం సమయంలో అక్కడ చీకటిగా ఉండటంతో పనులు నాలుగు గంటల వరకే ముగించుకుంటారట.
మొత్తానికి ఈ వింతైన గ్రామం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ప్రకృతి సిద్దంగా ప్రసాదించిన ప్రత్యేకతను ఆ గ్రామ ప్రజలు ఆస్వాదిస్తున్నారు.తమ ఊరు ఇంత ప్రత్యేకం అయినందుకు చాలా సంతోషంగా ఉందని, తమ గ్రామ గురించి అంతా తెలుసుకునేందుకు ఆసక్తి చూపడం సంతోషంగా ఉందంటున్నారు.ఇతర ప్రాంతాలతో పోల్చితే తమ గ్రామంలో చాలా చల్లగా ఉంటుందని వారు అంటున్నారు.
ఈ ప్రత్యేకమైన తెలంగాణ గ్రామం గురించి మిత్రులతో షేర్ చేసుకోండి.