Goddess Lakshmi : కార్తీక మాసం లోని శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజిస్తే ఆ ఇంటికి అన్ని ప్రయోజనాలు ఉన్నాయా..

కార్తీక మాసాన్ని మన దేశవ్యాప్తంగా ప్రజలందరూ వారి కుటుంబ సభ్యులందరితో కలిసి ఎంతో సంతోషంగా ఉల్లాసంగా జరుపుకుంటూ ఉంటారు.పూర్తి సంవత్సరంలో కార్తీక మాసాన్ని ఎంతో పవిత్రమైన నెలగా ప్రజలందరూ భావిస్తారు.

 If You Worship Goddess Lakshmi On Friday In The Month Of Kartika, Does That Hous-TeluguStop.com

కార్తీకమాసం అంతా భక్తులు పెద్ద ఎత్తున శివకేశవులను పూజించడమే కాకుండా లక్ష్మీస్వరూపిణి అయినటువంటి తులసి మాతను కూడా పుజిస్తూ ఉంటారు.కార్తీక మాసంలో వచ్చే శుక్రవారం రోజు శ్రీ మహాలక్ష్మికి ప్రత్యేకమైన పూజలు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఆ ఇంటిపై ఉంటుందని చాలా మంది ప్రజలు నమ్ముతారు.

అయితే కార్తిక మాసంలో వచ్చే శుక్రవారం అమ్మవారిని ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కార్తిక మాసంలో వచ్చే శుక్రవారం రోజు ఉదయం నిద్ర లేచి తల స్నానం చేసి శుభ్రమైన దుస్తులను ధరించి లక్ష్మీదేవి పూజ చేయాలి.

ఇలా శుక్రవారం రోజు ఉదయం మహిళలు లక్ష్మీదేవిని పూజించడం వల్ల కనకాంబరం పువ్వులను ధరించి పూజ చేయడం ఇంకా చాలా మంచిది.ఇలా పూజ చేయడం వల్ల వారు దీర్ఘ సుమంగళిగా ఉంటారని ఈ వేద పండితులు చెబుతున్నారు.

అంతే కాకుండా శుక్రవారం నాడు ఉపవాసం ఉన్నవారు ఒక్క సమయం మాత్రమే భోజనం చేసి రెండు పూటలు పండ్ల రసాలు మాత్రమే తీసుకుంటూ ఉంటారు.

Telugu Bhakti, Devotional, Kartika Masan, Lord Siva, Tulsi Mata, Worship, Worshi

శుక్రవారం సూర్యుడు అస్తమించే సమయంలో తప్పనిసరిగా తులసి కోటముందు దీపారాధన చేయడం ఎంతో మంచిది.ఈ విధంగా శుక్రవారం ఉదయం సాయంత్రం లక్ష్మీదేవి పటం ముందు కూడా దీపారాధన చేసి పూజ చేయడం మంచిది.తులసి కోట ముందు దీపాలను వెలిగించడం వల్ల లక్ష్మీదేవి ఎంతో సంతోషించి ఆ ఇంట్లోకి అడుగుపెడుతుందని చాలా మంది ప్రజల నమ్మకం.

ఇలా పూజ చేయడం వల్ల ఆ ఇంట్లోకి అష్టైశ్వర్యాలు వస్తాయని చాలామంది భక్తులు నమ్ముతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube