చాల మంది దేవాలయం దగ్గర ఇల్లు ఉంటే భగవంతుని స్తోత్రాలు ఎప్పుడూ వినపడతాయని మనస్సు ఉల్లాసంగా ఉంటుందని భావిస్తారు.వాస్తవానికి దేవాలయం దగ్గరలో ఇల్లు ఉండటం అనేది మంచిది కాదు అలాగే శుభం కూడా కాదు.
ప్రజ్వలంగా వెలుగుతున్న హోమ గుండానికి దగ్గరగా కూర్చొంటే ఆ వేడిని తట్టుకునే శక్తి మనకు ఉండదు కాబట్టి హోమ గుండానికి దగ్గరగా కూర్చోము.అలాగే దేవాలయానికి దగ్గరలో నివాసం ఉండక పోవడం కూడా అటువంటిదే.
దేవాలయం కేవలం పవిత్ర స్థలం మాత్రమే కాకుండా శాస్త్ర బద్ధంగా నిర్మించిన ఒక శక్తి కేంద్రకం.ఆ శక్తిని ప్రేరేపించే జప హోమ, యాగాదులు ఆలయాలలో జరుగుతూ ఉంటాయి.
అందుకని దేవాలయాల నీడ పడే చోట ఇల్లు కట్టుకోకూడదని అంటారు.కొన్ని దేవాలయాలకు ప్రత్యేకంగా కొన్ని వైపులలో అసలు నివసించ కూడదని అంటారు.
ఇంటికీ దేవాలయానికీ ఉండే దూరాన్ని గర్భ గుడిలోని మూల విరాట్టు విగ్రహం నుండీ కొలవాలి.
శివ, వైష్ణవ, శక్తి ఆలయాలకు 200 అడుగుల మేర వరకు ఇల్లును నిర్మించుకోరాదు.
ముందు చెప్పినట్టుగా దూరాన్ని గర్భ గుడిలోని మూల విరాట్టు విగ్రహం నుండీ పరిగణ లోకి తీసుకోవాలి.ఈ ఆలయాలకు అతి సమీపం లో నివసించడం వలన ఆ ఇల్లు దారిద్ర్యం లోకి నెట్టబడుతుంది.