న్యూస్ రౌండప్ టాప్ 20

1.బిజెపి పదాధికారుల సమావేశం

Telugu Ap Cm Jagan, Bandi Sanjay, Chandrababu, Cmaravind, Kishan Reddy, Lokesh,

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బిజెపి పదాధికారుల సమావేశం ఈరోజు ప్రారంభమైంది.కేంద్ర మంత్రి ,తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన బిజెపి కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుంది.

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Telangana,-TeluguStop.com

2.హైదరాబాదులో ఐటి రైట్స్

హైదరాబాదులో ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.ఉదయం 6 నుంచి ఏకకాలంలో 100 టీమ్స్ తో సోదాలు నిర్వహిస్తున్నారు.చిట్ ఫండ్స్ ఫైనాన్స్ కంపెనీలే టార్గెట్ గా ఈ రైట్స్ కొనసాగుతున్నాయి.

3.జగన్ కు సిపిఐ లేఖ

Telugu Ap Cm Jagan, Bandi Sanjay, Chandrababu, Cmaravind, Kishan Reddy, Lokesh,

విశాఖ ఉక్కు పరిశ్రమ విషయమై సిపిఐ ఏపీ కార్యదర్శి కె .రామకృష్ణ జగన్ కు లేఖ రాశారు.ఈరోజు జగన్ ఢిల్లీ పర్యటనలో విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ విషయమై ప్రధానమంత్రి తో చర్చించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

4 తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థుల జాబితా విడుదల

తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో కానిస్టేబుల్ సెలెక్షన్ లో ఎంపికైన అభ్యర్థుల జాబితాను పోలీసు నియామక బోర్డు విడుదల చేసింది.

5.సింగరేణిలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి

Telugu Ap Cm Jagan, Bandi Sanjay, Chandrababu, Cmaravind, Kishan Reddy, Lokesh,

సింగరేణి సంస్థ నిర్వహణలో ఉన్న ప్రస్తుత హైడ్రోజన్ ప్లాంటును గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ గా మార్చడంతో పాటు, స్వీయ నిర్వహణలో రామగుండం రీజియన్ లో ఒక గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటుకు ఆ సంస్థ శ్రీకారం చుట్టింది.

6.మంత్రి హరీష్ రావు పై ఫిర్యాదు

Telugu Ap Cm Jagan, Bandi Sanjay, Chandrababu, Cmaravind, Kishan Reddy, Lokesh,

మంత్రి హరీష్ రావు పై దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సిద్దిపేట పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.సిద్దిపేట రైల్వే స్టేషన్ వద్ద మంగళవారం జరిగిన ఘటనలో మంత్రితో పాటు , ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి , మంత్రి పిఏ శేషులపై వెంటనే కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

7.చంద్రబాబు కేసు

స్కిల్ డెవలప్మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు జ్యుడీషియల్ రిమండ్ పొడిగించాలని ఏసీబీ కోర్టులో సిఐడి మెమో దాఖలు చేసింది.

8.ఫైబర్ నెట్ కేసు

ఫైబర్ నెట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో మళ్ళీ వాదనలు ప్రారంభమయ్యాయి.

9.చంద్రబాబు అరెస్టుపై మంత్రి తలసాని కామెంట్స్

Telugu Ap Cm Jagan, Bandi Sanjay, Chandrababu, Cmaravind, Kishan Reddy, Lokesh,

చంద్రబాబు అరెస్టు వెనుక కేంద్ర హస్తం ఉందని తెలంగాణ మంత్రి తలసరి శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

10.పాపికొండల యాత్ర ప్రారంభం

పాపికొండలు విహారయాత్ర టికెట్లు భద్రాచలంలో ప్రారంభమయ్యాయి.నాలుగు రోజుల కింద కేవలం టూరిజం బోటుకి మాత్రమే ఏపీ ప్రభుత్వం అనుమతించింది.అయితే ప్రైవేటు లాంచీలకు అనుమతిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

11.ప్రధానిపై ఢిల్లీ సీఎం విమర్శలు

Telugu Ap Cm Jagan, Bandi Sanjay, Chandrababu, Cmaravind, Kishan Reddy, Lokesh,

ప్రధాని నరేంద్ర మోది అత్యంత అవినీతిపరుడని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన విమర్శలు చేశారు.

12.ఏపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ విమర్శలు

ఏపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనేక విమర్శలు చేశారు.ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తూ అనేక వేధింపులకు పాల్పడుతోంది అని పవన్ మండిపడ్డారు.

13.అచ్చెన్న కామెంట్స్

Telugu Ap Cm Jagan, Bandi Sanjay, Chandrababu, Cmaravind, Kishan Reddy, Lokesh,

ఎన్నికల వరకు టిడిపి అధినేత చంద్రబాబును జైల్లోనే ఉంచాలని వైసీపీ ప్రభుత్వం చూస్తూ ఉందని , ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు అనుమానం వ్యక్తం చేశారు.

14.బిజెపిపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు విమర్శలు

బిజెపికి రాజ్యాంగం పై విశ్వాసం లేదని, అందుకే ప్రజలను మోసం చేస్తుందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్దర్రాజు విమర్శించారు.

15.సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ

Telugu Ap Cm Jagan, Bandi Sanjay, Chandrababu, Cmaravind, Kishan Reddy, Lokesh,

నేడు సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు ను జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సుందరిష్ ల ధర్మసనం విచారణ చేపట్టనుంది.

16.తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది .భారీగా క్యూ లైన్ లలో భక్తులు వేచి ఉన్నారు.శ్రీనివాస్ రెడ్డి దర్శనం కోసం దాదాపు 18 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

17.మల్లికార్జున స్వామి ఆలయానికి ఐటీ నోటీసులు

Telugu Ap Cm Jagan, Bandi Sanjay, Chandrababu, Cmaravind, Kishan Reddy, Lokesh,

సిద్దిపేట జిల్లాలో ఉన్న కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి ఐటీ నోటీసులు జారీ అయ్యాయి .ఈరోజు ఉదయం కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి ఐటీ నోటీసులు జారీ చేశారు.

18.విజయ ఫెడరేషన్ మెగా డైరీ ప్రారంభం

తెలంగాణ రంగారెడ్డి జిల్లాలోని తెలంగాణ విజయ ఫెడరేషన్ కు చెందిన మెగా డైరీ ప్రారంభోత్సవంకి సిద్ధమైంది.మహేశ్వరం మండలం రావిర్యాలలో 250 కోట్లతో 40 ఎకరాలు విస్తీర్ణంలో ఈ మెగా డైరీ నిర్మించారు.

19.బాలకృష్ణ కామెంట్స్

Telugu Ap Cm Jagan, Bandi Sanjay, Chandrababu, Cmaravind, Kishan Reddy, Lokesh,

తెలంగాణ టిడిపి నేతలతో హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ భవన్  లో అత్యవసర భేటీ నిర్వహించారు.ఈ సందర్భంగా తెలంగాణను ఎన్టీఆర్ , చంద్రబాబు అభివృద్ధి చేశారని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.

20.తెలంగాణలో ఓటర్ లిస్ట్ విడుదల

తెలంగాణలో ఓటర్ల జాబితాను తెలంగాణ చీఫ్ ఎలక్ట్రోలర్ ఆఫీసర్ వికాస్ విడుదల చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube